కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు స్వాగతం పలికిన మంత్రి లోకేష్
ఉండవల్లి: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్వాగతం పలికారు. పల్నాడు జిల్లా ( Palnadu district) నర్సరావుపేటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా రుణమేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ముందుగా ఉండవల్లి నివాసానికి చేరుకున్న నిర్మలా సీతారామన్ కు సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)తో కలిసి మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ను మంత్రి శాలువాతో సత్కరించారు.








