ఆఫీస్‌లో లేదా ఇంట్లో చిన్న విషయాలకే చిరాకు వస్తోందా? మీ మూడ్ పాడవడానికి మీ ఆహారపు అలవాట్లే కారణం కావచ్చు, గమనించండి!
ఎక్కువ కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి, గుండె వేగం, చిరాకు ఎక్కువవుతాయి.
కాఫీలు, ఎనర్జీ డ్రింక్స్
స్వీట్లు, కూల్ డ్రింక్స్ రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెంచి తగ్గిస్తాయి. ఈ షుగర్ క్రాష్ తీవ్రమైన ఇరిటేషన్ తెస్తుంది.
షుగర్ క్రాష్
మైదాతో చేసిన బేకరీ ఫుడ్స్ త్వరగా జీర్ణం కావడం వల్ల శరీరంలో శక్తి త్వరగా తగ్గిపోయి, నీరసంతో పాటు కోపం పెరుగుతుంది.
మైదా & రిఫైండ్ కార్బ్స్
ఆకలిని భరిస్తూ భోజనం ఆలస్యం చేస్తే బ్లడ్ షుగర్ పడిపోతుంది. దీనివల్ల వచ్చే 'హ్యాంగ్రీ' (Hangry) మూడ్‌ని పాడుచేస్తుంది.
మీల్స్ స్కిప్ చేయడం
ప్యాక్ చేసిన చిప్స్, రెడీ-టు-ఈట్ ఫుడ్స్ శరీరంలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ (వాపు) కలిగించి, మెదడు పనితీరుపై ప్రభావం చూపుతాయి.
అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్
ఒంట్లో నీటి శాతం తగ్గితే మెదడు అలసిపోతుంది. తలనొప్పి, ఏకాగ్రత లోపించడం మరియు తెలియని ఇరిటేషన్ మొదలవుతాయి.
డీహైడ్రేషన్
షుగర్-ఫ్రీ పేరుతో వాడే అస్పర్టేమ్ వంటి కృత్రిమ తీపి పదార్థాలు యాంగ్జైటీ, మానసిక అసంతృప్తిని పెంచుతాయని పరిశోధనలు చెప్తున్నాయి.
ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్
ఉప్పు ఎక్కువగా ఉండే ఫాస్ట్ ఫుడ్స్ రక్తపోటును పెంచుతాయి. ఇది శారీరక అసౌకర్యాన్ని కలిగిస్తూ చిరాకుకి దారితీస్తుంది.
ఎక్కువ ఉప్పు
తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తింటూ, సమయానికి నీరు తాగడం అలవాటు చేసుకోండి. ప్రశాంతమైన మీ మూడ్ మీ చేతుల్లోనే ఉంది!