మమ్మల్నికాదంటే సీమైన్స్ కు బలవుతారన్న ఇరాన్.. తప్పుడు ప్రచారమన్న అమెరికా..!
హర్మూజ్ విషయంలో అమెరికా, ఇరాన్ పంతాలు, పట్టుదలలతో ముందుకెళ్తున్నాయి. ఆధిపత్యం, దాని ద్వారా వచ్చే ట్యాక్స్ తమదే అని తెగేసి చెబుతున్నాయి. ఫలితంగా ఎవరికి వారు బలాలు, బలగాలు మోహరించి.. సై అంటే సై అంటున్నాయి. నౌకలపై దాడులకు ఇరాన్ తెగబడుతుంటే.. టెహ్రాన్ పై ముమ్మర దాడులు చేస్తోంది అమెరికా. దీంతో హర్మూజ్ పై ఎవరి పట్టు ఉంది. ఎవరి మాట విని ముందుకు సాగాలన్నది వాణిజ్య కంపెనీలు, దేశాలకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
తమ హెచ్చరికలు పట్టించుకోని నౌకలపై ఇప్పటికే అమెరికా-ఇరాన్ (USA-Iran) దాడులు చేస్తుంటే.. మందుపాతరలు (Mines) మరో ముప్పుగా మారాయి. రెండు చమురు ట్యాంకర్లు వాటిని ఢీకొట్టడంతో పేలిపోయాయని శనివారం ఐఆర్జీసీ వెల్లడించింది.అమెరికా నిఘా సంస్థలు ఇచ్చిన సమాచారంతో ఈ నౌకల సదరు మార్గం మీదుగా ప్రయాణించాయి’’ అని ఐఆర్జీసీ ప్రకటించింది. అలాగే ఈ జలమార్గం మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించిన నాలుగు నౌకలను అడ్డుకున్నామని వెల్లడించింది.
హర్మూజ్‌లో సీమైన్లను ఢీకొట్టి రెండు చమురు ట్యాంకర్లు పేలినట్లు ఇరాన్ చేసిన ప్రకటనను అమెరికా ఖండించింది (USA-Iran). ఎప్పటిలాగే ఐఆర్జీసీ అసత్య ప్రచారం చేస్తోందని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. హర్మూజ్‌లో రాకపోకలను అమెరికా, ఇరాన్ నియంత్రిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన నౌకలపై దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా నిఘా సమాచారంపై ఆధారపడి వెళ్లిన రెండు నౌకలు సీమైన్స్‌ను ఢీకొట్టి పేలిపోయాయని ఐఆర్జీసీ వెల్లడించింది.
తమ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే.. ఎర్రసముద్రంలోని బాబ్ అల్ మాండెబ్ జలసంధిని మూసివేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇరాన్ (Iran) హూతీ రెబెల్స్‌ను కోరింది. అయినా సరే అమెరికా ఆ మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసింది. ఇరాన్-హూతీలు కలిసి ఆ జలసంధి మీదుగా జరిగే సముద్ర వాణిజ్యానికి అంతరాయం కలిగించాలని నిర్ణయించుకుంటే.. తీవ్ర ఉద్రికత్తలకు దారితీయొచ్చని గతంలో యూఎస్ విదేశాంగశాఖలో పనిచేసిన కల్నల్ అబ్బాస్ దహౌక్ ఆందోళన వ్యక్తంచేశారు.








