మహిళా శక్తి దీవెనలే మా ప్రభుత్వ బలం : సిఎం రేవంత్ రెడ్డి
ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ మహిళా పారిశ్రామికవెత్తలతో సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి గారు..
మహిళా శక్తి దీవెనలే మా ప్రభుత్వ బలం! మహిళల మద్దతుతొనే 2023 డిసెంబర్ లో ప్రజా ప్రభుత్వం కొలువుదీరింది
మహిళా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేసేందుకు 22 జిల్లా కేంద్రాలలో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నాం… త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం .. ఈ ఇందిరా మహిళా శక్తి భవనాలను శిక్షణ, మార్కెటింగ్, వ్యాపారానికి కేంద్రంగా పనిచేసేలా కార్పొరేట్ హంగులతో నిర్మిస్తున్నాం
హైటెక్ సిటీ ప్రాంతంలో శిల్పారామంకు అనుకుని రూ.1,000 కోట్ల విలువైన స్థలాన్ని ఇందిరా మహిళా శక్తి బజార్ నిర్వహించడానికి కేటాయించాం .. ప్రత్యేక సదుపాయంలో, గ్రామీణ హస్తకళలు, సాంప్రదాయ ఉత్పత్తులను విక్రయించడానికి మహిళా స్వయం సహాయక బృందాలకు ప్రత్యేకంగా కేటాయించిన 150కి పైగా దుకాణాలు విజయవంతంగా నడుస్తున్నాయి
అదే స్పూర్తితో మహిళా సాధికారత కోసం ఫిక్కీ అభ్యర్ధనలను అత్యంత ప్రాముఖ్యతతో నెరవేరుస్తాం .. ఫిక్కీ ప్రధాన కార్యాలయం నిర్మించుకోవడానికి శిల్పారామం పక్కనే వెయ్యి గజాల స్థలాన్ని కేటాయిస్తాం .. హైటెక్ సిటీ, సిఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) కార్యాలయానికి మధ్యలో ఫిక్కీ కార్యాలయం ఆ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది
దీంతో పాటు ఫిక్కీని ఈ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగస్వామిని చేసే ఆలోచనతో .. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫిక్కీకి ఒక ఎకరం స్థలాన్ని కేటాయిస్తాం .. మహిళల అభ్యున్నతికి ఏమి చేసినా వ్యక్తిగతంగా నాకు చాలా సంతృప్తినిస్తుంది
అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థ ఫ్యూచర్ సిటీలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది .. రానున్న రోజుల్లో ప్రపంచ అగ్రగామి ఫార్చ్యూన్-500 కంపెనీలనన్నింటినీ ఫ్యూచర్ సిటీ లో నెలకొల్పాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం .. దీంట్లో ఫిక్కీ తోపాటు మహిళా పారిశ్రామికవెత్తల పాత్ర కీలకం కానుంది
ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆద్వర్యంలోని ఇండస్ట్రియల్ పార్క్ విజయవంతమైన నేపథ్యంలో మరొక ఇండస్ట్రియల్ పార్క్ ను మహిళా సాధికారత కోసం అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తాం … మహిళలు ఆర్ధికంగా ఎదిగిన దేశాల్లో ఆర్థిక వృద్ధి మరియు జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయి
ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం, 2027 లో ఫిక్కీ 100 ఏళ్ళు పూర్తి చేసుకోవడం సంతోషం ..
జులై 4, 2006లో జడ్పీటీసీగా మొదలైన నా రాజకీయ ప్రస్థానం .. ఎమెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కేవలం 17 సంవత్సరాల్లో విజయవంతంగా సాగింది .. ఈరోజు ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ మహిళా వ్యాపారవేత్తలతో సమావేశం కావడం ఆనందకరం
మహిళా పారిశ్రామికవెత్తలను శాయ శక్తులా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాం .. మహిళా పారిశ్రామికవెత్తలతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తా ..
తెలంగాణలో మహిళా పొదుపు సంఘాలు సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 67 లక్షల సంఘాలు ఉన్నాయి. వీటికి ₹16,000 కోట్ల రుణాలు అందాయి.
ఇప్పుడు మన మహిళలు పెట్రోల్ బంకులను కూడా నిర్వహిస్తూ, కార్పొరేట్ దిగ్గజాలతో పోటీ పడుతున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణాలకు ఇప్పటిదాకా మా ప్రభుత్వం రూ. 11 వేల కోట్లు చెల్లించాం ..
ఈ పధకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని అనుకుంటున్నారు .. వాస్తవానికి మహిళలే వెయ్యి బస్సులకు యజమానులుగా మారి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చి నడుపుతున్నారు .. ఉచిత ప్రయాణాలు కాదు .. మహిళలే ఆర్టీసీ బస్సులకు యజమానులు
ఇందిరా మహిళా శక్తి పథకం కింద, మహిళా స్వయం సహాయక బృందాల యాజమాన్యం, నిర్వహణలో 1,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తోంది
రాష్ట్రవ్యాప్తంగా 27,000 ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను మహిళా స్వయం సహాయక బృందాలకు అప్పగించాం
27 లక్షల 50 వేల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రెండు జతల యూనిఫారాలు కుట్టే బాధ్యతను మహిళా స్వయం సహాయక బృందాలకు అప్పగించాం. ఒక్కో యూనిఫారానికి రూ.75 చొప్పున చెల్లిస్తున్నాం
రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల కోసం 8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన చేసాం
మహిళా సంఘాల ఉత్పత్తులను అమెజాన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విక్రయించే దిశగా పనిచేస్తున్నాం
వ్యాపారాల్లో గొప్పగా రాణిస్తున్న మహిళా సంఘాలకు ఫిక్కీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అవార్డులు ఇచ్చి గౌరవించుకునే ఆనవాయితీ తీసుకురావాలి
వికసిత్ భారత్ 2047 లక్ష్యమైన 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో, 2.5% జనాభా ఉన్న తెలంగాణ దేశ జీడీపీ లో తన వాటాను 5% నుండి 10%కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.. 2034 కల్లా 1 ట్రిలియన్, 2047 కల్లా 3 ట్రిలియన్
డాలర్ల లక్ష్యంగా పెట్టుకున్నాం
ఈ దేశానికి మహిళలను అత్యంత ఉన్నత స్థానాల్లో ప్రోత్సహించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది .. ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, జడ్జిలు, గవర్నర్ లుగా మహిళలను కాంగ్రెస్ ప్రోత్సహించింది
సోనియా గాంధీ 2013లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటివరకు అది అమలు కాలేదు, వచ్చే ఎన్నికల తర్వాత అమలవుతుందని ఆశిస్తున్నా
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సిఎం సలహాదారు రామకృష్ణా రావు, ఎఫ్ఎల్ వో జాతీయ అధ్యక్షురాలు పూజా గర్గ్, ఎఫ్ఎల్ వో హైదరాబాద్ చైర్పర్సన్ సీతా రెడ్డి గడ్డం, సహా అనేక మహిళా పారిశ్రామికవెత్తలు పాల్గొన్నారు








