మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం
వైసీపీ ప్రభుత్వం (YCP government) హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. పీటీ వారెంట్‌తో ఈ కేసులో ఏ1 వాసుదేవరెడ్డి (Vasudeva Reddy), ఏ4 రాజ్ కెసిరెడ్డి (Raj KC Reddy), ఏ8 కరుమూరి సునీల్ (Karumuri Sunil)ను సీఐడీ సిట్ అధికారులు తరలించారు. ఈడీ అరెస్టుతో ప్రస్తుతం చంచల్‌గూడ జైలు (Chanchalguda Jail)లో నిందితులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మద్యం రవాణా కేసులో ముగ్గురు నిందితులను ఏపీ సీఐడీ సిట్ ప్రశ్నించనుంది. నిందితుల పాత్రపై కీలక వివరాలు రాబట్టనుంది.








