ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
జాతీయ పోలీస్ అకాడమీ (Police Academy)లో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి (IPS Uday Krishna Reddy) ఆత్మహత్యయత్నం చేశాడు. మోతీనగర్‌లోని బంధువు ఇంటికి వచ్చిన ఉదయ్ శానిటైజర్ (sanitizer) తాగి ఆత్మహత్మకు యత్నించాడు. వెంటనే అతడిని బంధువులు ఆస్పత్రికి తరలించారు. ఎస్ఆర్ నగర్‌లోని ఓ ఆస్పత్రిలో ఉదయ్ చికిత్స పొందుతున్నాడు. ట్రైనీ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ (Attapur Police Station)లో ఉదయ్ కృష్ణారెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.








