ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం : హోం మంత్రి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) ఆగస్టు 1వ తేదీన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anita) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడారు. వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా జానపద కళారూపాలతో స్వాగత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రధాని పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. భోగాపురం ఎయిర్పోర్టు (Bhogapuram Airport) ప్రారంభోత్సవానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రధాని పర్యటన ఏర్పాట్లను అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas), కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ పరిశీలించారు.








