Revanth Reddy: మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు : సీఎం రేవంత్ రెడ్డి
మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. జేఎన్టీయూ (JNTU) ఆడిటోరియంలో స్టాండ్ విత్ హర్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నాం. వారు ఆర్థికంగా బలపడాలనే ఆలోచనతోనే మహిళాశక్తి పథకం తీసుకొచ్చాం. మహిళలపై ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉంది. వారి ప్రాధాన్యం గుర్తించి పార్టీలో పదవులు ఇస్తున్నాం. ఆర్టీసీ (RTC)లో వెయ్యి బస్సులకు మహిళలే యజమానులు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, నగర పోలీసు కమిషనర్ సజ్జనార్, సినీ నటుడు సాయి దుర్గుతేజ్ (Sai Durgutej) తదితరులు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇవి కూడా చదవండి








