KTR: అమెరికా పర్యటనకు కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వారం రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం అమెరికా (America)కు బయలుదేరి వెళ్లారు. న్యూయార్ లోని ప్రముఖ కొలంబియా యూనివర్సిటీ (Columbia University)లో ఏప్రిల్ 4న జరిగే ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ (India Business Conference) లో ఆయన ప్రసంగించనున్నారు. కొలంబియా యూనివర్సిటీకి చెందిన సౌత్ ఏషియా బిజినెస్ అసోసియేషన్ (సబా) గత 21 ఏండ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ ఏడాది ది న్యూ ఇండియా ప్లేబుక్ అనే థీమ్ తో నిర్వహిస్తున్న ఈ సదస్సులో భారతీయ వ్యాపార వ్యూహాలు, సుస్థిరతపై అనేక రంగాలకు చెందిన ప్రముఖులు చర్చించి ప్రసంగించనున్నారు. ప్రపంచ వ్యాపార గమనంలో సరికొత్త అధ్యాయం అనే అంశంపై కేటీఆర్ మాట్లాడనున్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ వ్యాపార రంగం, ఆర్థిక సంసరణలు, అభివృద్ధి వ్యూహాలపై ఆయన తన అనుభవాలను పంచుకోనున్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రిగా గతంలో ఆయన సాధించిన విజయాలు, రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చిన తీరును దృష్టిలో ఉంచుకుని కేటీఆర్ కు ఈ ఆహ్వానం అందింది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








