KTR: మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి : కేటీఆర్
ప్రతిపక్షాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అంశంలో సభా సంఘం వేయాలని కోరితే సీఐడీ (CID)ని అడ్డుపెట్టుకుని మంత్రి పొంగులేటిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పార్టీ నేతలతో కలిసి లోక్‌భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా (Shivapratap Shukla)ను కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటిపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారి అవినీతికి పాల్పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ అంశంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని, స్వతంత్ర విచారణకు ఆదేశించాలని కోరినట్లు తెలిపారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరామన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








