US-IRAN Conflict: మలిదశకు అమెరికా-ఇరాన్ యుద్ధం..?
ఓవైపు బలవంతుడు.. మరోవైపు మొండిపట్టుదల కలిగిన వ్యక్తి.. ఇద్దరు బలప్రదర్శనకు దిగితే ఫలితమెలా ఉంటుందో ప్రపంచానికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్.. యుద్ధంలో ఎదురుదెబ్బలు తగులుతున్నా… ఎగ్జిట్ అయ్యేందుకు అంగీకరించడం లేదు. అటు.. ఇరాన్ సుప్రీంనేతలు… దీన్ని ఆత్మగౌరవం పేరుతో కొనసాగిస్తున్నారు.అంతేనా.. యుద్ధంలో పోరాడితే.. అమరత్వమంటూ యువతను ప్రోత్సహిస్తున్నారు. దీంతో వేలాదిగా యువత.. యుద్ధంలో పాల్గొంటోంది. మరి ఈ యుద్ధానికి అంతమెలా..?
యుద్దంలో ఆధిపత్యం సాధిస్తున్నామన్న ఆశలు ఏమాత్రం అమెరికాలో కనిపించడం లేదు. దీంతో పోరును తదుపరి దశకు తీసుకెళ్లేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగా వేలాదిగా యూఎస్ బలగాలను పశ్చిమాసియాకు తరలించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
వైమానిక, నావికాదళాల ద్వారా హర్మూజ్(HORMUZ) జలసంధి మీదుగా చమురు ట్యాంకర్ల రవాణాకు రక్షణ కల్పించే విషయంపైనా ప్రభుత్వం చర్చలు జరిపినట్లు అమెరికా ప్రతినిధి వెల్లడించారు. అయితే, ఇందుకోసం ఇరాన్ తీర ప్రాంతంలో యూఎస్ సైన్యాన్ని మోహరించాల్సి రావచ్చన్నారు. వీటితో పాటు ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన ఖర్గ్ ద్వీపానికి యూఎస్ బలగాలను పంపే విషయంపైనా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఆపరేషన్ అత్యంత ప్రమాదకరమైనదని యూఎస్ అధికారి ఒకరు హెచ్చరించారు. ఈ ప్రణాళికలన్నింటిపై చర్చలు జరిగినప్పటికీ.. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
గతనెల 28న యుద్ధం ప్రారంభమైనప్పటినుంచి ఇరాన్‌పై 7,800కు పైగా దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఇరాన్‌కు చెందిన 120 నౌకలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 13 మంది యూఎస్ సైనికులు మరణించగా.. సుమారు 200 మంది గాయపడినట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి








