US-Iran War: చమురు ప్రళయం అంచున ప్రపంచం..!
అమెరికా, ఇజ్రాయెల్ ఎంతగా దాడులు చేస్తున్న ఇరాన్ తలవంచడం లేదు. మొదట కేవలం మిలటరీ , ఆయుధ వ్యవస్థలపైనే దాడులు చేసిన ఈ దేశాలు..ఇప్పుడు మౌలిక వసతులపైనా దాడులు చేస్తున్నాయి. అంతేనా.. క్రమంగా వీటి దాడికి ఇరాన్ చమురు గుండెకాయ.. ఖర్గ్ కూడా ప్రభావితమవుతోంది. మేం ఖర్గ్ పై ఎటాక్ చేయమంటూనే.. అక్కడి కార్యకలాపాలను చక్కబెట్టేస్తోంది అమెరికా. ఇది ఎంతవరకూ వెళ్తుందో ఎవరికీ తెలియదు..
ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే… ఇక ప్రపంచంలో చయురు ప్రళయం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అణ్వాయుధ ముప్పు సంగతి సరేసరి.. మరీ ముఖ్యంగా చమురు ఆకలి .. ప్రప్రంచాన్ని బుగ్గి చేస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ చమురు ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతాయని ..దీంతో భారత్ లాంటి వర్ధమాన దేశాల ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని హెచ్చరించారు కూడా.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్టులో బ్యారెల్ చమురు ధర వందడాలర్లు దాటేసింది. ఇరాన్ తో అమెరికా యుద్ధం రోజుల తరబడి కొనసాగితే.. అవి $150 నుంచి $200కి చేరుతుంది. హార్ముజ్ జలసంధి నుంచి ప్రపంచంలో వినియోగించే చమురులో దాదాపు 20% (రోజుకు 21 మిలియన్ బ్యారెల్స్) రవాణా అవుతుంది. ఈ మార్గం మూతపడితే సరఫరా నిలిచిపోతుంది. ధరలు విపరీతంగా పెరుగుతాయి.
చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి, దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం (Inflation) తీవ్ర స్థాయికి చేరుతుంది. . ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుంది. చమురు దిగుమతులపై ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలు తీవ్రంగా దెబ్బతింటాయి.
అమెరికా దాడి చేస్తే, ఇరాన్ ఊరికే ఉండదు. హార్ముజ్ జలసంధిలో నౌకలను ముంచేస్తుంది. క్షిపణులతో చమురు ట్యాంకర్లను ధ్వంసం చేస్తుంది. ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తుంది. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ వంటి దేశాల చమురు కూడా నిలిచిపోతుంది. హోర్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయం లేదు. సౌదీ అరేబియా యూఏఈలకు కొన్ని పైప్లైన్లు ఉన్నప్పటికీ, అవి మొత్తం చమురు రవాణాలో చాలా తక్కువ శాతాన్ని మాత్రమే తరలించగలవు.
ఇవి కూడా చదవండి








