18న 'సాహో' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

18న 'సాహో' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

16-08-2019

18న 'సాహో' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

ప్రభాస్‌ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సాహో. తాజాగా విడుదలైన ట్రైలర్‌ అంచనాలను మరింత పెంచేసింది. ఈ హీట్‌ను పెంచేందుకు రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ నెల 18న ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ వేడుక కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానులు భారీగా తరలివచ్చే ఈ వేడుక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తుండగా, వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి, భూషణ్‌కుమార్‌ నిర్మాతలు.