ASBL NSL Infratech

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో చంద్రబాబు, లోకేష్ పై కేసు నమోదు..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో చంద్రబాబు, లోకేష్ పై కేసు నమోదు..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తో పాటుగా నారా లోకేష్ పై ఏపీ సీఐడీ కేసు దాఖలు చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఫేక్ ప్రచారం చేయిస్తున్నారు అనే ఫిర్యాదుతో వీరిద్దరిపై కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాదు ఎఫ్ఐఆర్ లో A1గా చంద్రబాబు పేరు, A2 గా నారా లోకేష్ పేరు పేర్కొనడం గమనార్హం. వీరిద్దరితో పాటుగా మరొక పదిమందిపై ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై IVR కాల్స్ ద్వారా టీడీపీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తోందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే.. వైసిపి నేత మళ్ళా అది విష్ణు ఎన్నికల కమిషన్ కు నిన్న ఫిర్యాదు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని.. జగన్ కి ఓటు వేసి గెలిపిస్తే మీ భూములు మీరు కోల్పోతారని తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా.. జగన్ కు ఓటు వేయొద్దు అని ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని విష్ణు తన ఫిర్యాదులు పేర్కొన్నారు. అంతేకాదు కాల్స్ లో చెబుతున్నటువంటి విషయాలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘిస్తున్న విధంగా ఉన్నాయని ఆయన ఎన్నికల సంఘానికి నివేదించారు. వెంటనే ఈ IVR కాల్స్ ను పరిగణలోకి తీసుకొని.. తప్పుడు ప్రచారాన్ని నిలిపివేయాలని టీడీపీ కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. దీంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్లో చంద్రబాబు, లోకేష్ పై కేసు నమోదు అయింది. దీనిపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ అధికారులు ఆడియో ఫైల్స్‌తో కూడిన పెన్‌డ్రైవ్‌ తో పాటు మరికొన్ని ఆధారాలు సేకరించారని టాక్.



praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :