ASBL NSL Infratech

ట్విట్టర్ సాక్షిగా రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..

ట్విట్టర్ సాక్షిగా రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మరొకసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాల గురించి క్లియర్ గా తెలియాలంటే.. అభివృద్ధి ఎలా ఉందో చూడాలి అంటే చీర కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కమని.. కేటీఆర్ రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ కాంగ్రెస్ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. తెలంగాణలో ఆడబిడ్డలకు నెలకు ₹2,500 అందజేస్తున్నామని మాట్లాడిన విషయాన్ని కేటీఆర్ మరొకసారి తన ట్వీట్ లో ప్రస్తావించారు. అంతేకాదు రేవంత్ రెడ్డి.. చీర నువ్వు కట్టుకుంటావా లేక రాహుల్ గాంధీకి కట్టిస్తావా?.. ఎక్కడ మీరు ఇస్తున్న 2,500?.. మీరు మాట్లాడేవన్నీ అబద్ధాలే.. అని విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణలో 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలు కోటి 67 లక్షల మంది ఉన్నారని.. 100 రోజుల్లో అన్ని చేస్తాను అని కాంగ్రెస్ మాట తప్పిందని ఆయన ఎద్దేవా చేశారు. ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు ఇస్తాము అని చెప్పింది అంతా ఒక బిల్డప్ మాట అని.. బస్సులో కనీసం సీట్లు దొరకక ఆడపడుచులు రోడ్డు మీద ముష్టి యుద్ధాలు చేసే దుస్థితి వచ్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అసమర్థ ప్రభుత్వమని ప్రజలకు ఇప్పటికే తెలిసొచ్చిందని ఆయన పేర్కొన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :