ASBL NSL Infratech

వైసీపీ బాటలో టీడీపీ.. సైకిల్ బాటలో ఫ్యాన్...

వైసీపీ బాటలో టీడీపీ.. సైకిల్ బాటలో ఫ్యాన్...

యుద్ధతంత్రం.. ఓ అద్భుతమైన కళ. ఇది కచ్చితంగా అమలు చేసిన పార్టీ.. ఎన్నికల్లో గెలవడం పక్కా అని చెప్పొచ్చు. అందులో మొదటిది. నీబలం పెంచుకోవడం... ప్రజల్లో పార్టీకి ఆదరణను పెరిగేలా చేయడం.. ఇది సాదారణంగా అన్నిపార్టీలు చేస్తాయి.. తాము చేపట్టిన సంక్షేమపథకాలను వివరిస్తూ ముందుకెళ్తాయి. ప్రజల్ని ఓటడుగుతాయి. తాము అధికారంలో ఉంటేనే ఇవన్నీ సక్రమంగా జరుగుతాయని.. లేదంటే వీటికి ప్రత్యర్థి పార్టీ మంగళం పాడేస్తుందని..ప్రజల్లో భయాందోళనలు రేపి, వాటిని ఓటుబ్యాంకుగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తాయి. ఇవి గతం నుంచి పాలిటిక్స్ ను చూసిన వారికి పక్కాగా అర్థమయ్యే సంగతి.

అయితే ఇదే రాజనీతిలో మరో పార్శ్యం కూడా ఉంది. అదే ప్రత్యర్థి బలంపై దెబ్బకొట్టడం. అంటే వారు దేన్ని నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారో... దానిపై పంచ్ విసిరి, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం. దీన్ని ఎన్నికల ప్రచారంలో పార్టీలు అమలు చేస్తున్నాయి. మొదటి నుంచి సీఎం జగన్.. సంక్షేమ అస్త్రాన్ని నమ్ముకున్నారు. మేం అన్ని పథకాలు అమలు చేస్తున్నాం.. మాపథకాలు మీకు అంది, మీరులబ్ధి పొంది ఉంటే.. మాపార్టీకు ఓటేయండని అడుగుతున్నారు. ఇది చూసేందుకు సాదారణంగా ఉన్నప్పటికీ.. దీని వెనక ఓపెద్ద వ్యూహమే ఉందని చెప్పొచ్చు. అంటే తాము అంత పక్కాగా పథకాలు అమలు చేశామని..ప్రజలు తమకే ఓటేస్తారని క్యాడర్ లో విశ్వాసం కలిగించడం, దీన్ని బాగా పబ్లిసిటీ చేసి, ఓటు బ్యాంకు పటిష్టం చేసుకోవడం. లక్ష్యంగా కనిపిస్తోంది.

అయితే .. అలాంటి సీఎం జగన్.. ఇప్పుడు అంటే ఎన్నికల ముందు ఒక్కసారిగా అభివృద్ధి రాగం అందుకున్నారు. తాము అభివృద్ధి చేస్తున్నామంటున్నారు. వాటికి నాడునేడు, ఆర్బీకే, ఆస్పత్రులు, ఇతర పథకాలు చూపిస్తున్నారు. ఇంత అభివృద్ధి చేశామని.. టీడీపీ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. జన్మభూమి కమిటీలతో ప్రజల్ని దోచుకుందని చెబుతున్నారు. అందుకే తమకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు.

అయితే చంద్రబాబు సైతం అభివృద్ధితో పాటు సంక్షేమరాగం అందుకున్నారు. తాము పవర్ లోకి వస్తే కచ్చితంగా అన్ని సంక్షేమపథకాలను అమలు చేస్తామంటున్నారు. వైసీపీ కన్నా ఓ అడుగు ముందుకేసి, వాటికి అదనంగా కొన్నింటిని లిస్టులో చేర్చారు. వీటన్నింటినీ కేంద్రం సాయంతో పక్కాగా ఆమలుచేస్తామని చెబుతున్నారు. అసలు తాము బీజేపీతో పొత్తు పెట్టుకుందే... కేంద్రం సాయం ఉంటుందని క్లారిటీ ఇస్తున్నారు.

అంటే వైసీపీ సంక్షేమరాగాన్ని టీడీపీ అందుకుంటే.. టీడీపీ అభివృద్ధి గాత్రాన్ని వైసీపీ అక్కున చేర్చుకుందన్నమాట. అంటే ప్రత్యర్థుల బలం, బలహీనత ఎరిగి దెబ్బకొట్టడానికి పార్టీలు .. తమ ప్రయత్నాలను ఎంతగా ముమ్మరం చేశాయో దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పొచ్చు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :