India: భారత్ లో గ్యాస్ కటకట.. పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు..!
అమెరికా-ఇరాన్ వార్(US-IRAN WAR) ప్రపంచదేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. సాదారణంగారెండు దేశాల మధ్యయుద్ధం జరిగితే ప్రపంచ దేశాలు కలుగచేసుకోకుండా ఉండే పరిస్థితులున్నాయి. ఉదాహరణకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇతర దేశాలు పెద్దగా కలుగజేసుకోలేదు. కానీ ఇరాన్ వార్ మాత్రం.. అన్ని దేశాలకు ప్రాణసంకటంలా మారింది. ఎందుకంటే ఇరాన్ హర్మూజ్ జలసంధిని పిడికిట పట్టింది. దీంతో ప్రపంచ ఆర్థిక జీవనాడి ప్రమాదంలో పడింది.
ఈ ప్రభావం మనదేశంపైనా గట్టిగానే పడింది. ఇండియాలో గ్యాస్ సిలిండర్ ధర బారీగా పెరిగింది. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు తీవ్ర కటకట ఎదురైంది. ఇప్పటికే సిలిండర్ల పంపిణీ ఆపేశారు. మాకు కష్టాలు మొదలైనట్లే’నని పలువురు హోటల్ యజమానుల సంఘం నేతలు ఆవేదన చెందుతున్నారు.
పెళ్లిళ్లకు, ఫంక్షన్ హాళ్లకు సైతం గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆపేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక హోటళ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇప్పటికే ప్రముఖ హోటళ్లు మెనూల్ని తగ్గించడంతో పాటు ఆర్డర్లను తీసుకోవడంలేదు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆగిపోయిందని యజమానులు చెబుతున్నారు. ఇదే తరహా ఇబ్బందులు పలుచోట్ల ఉన్నాయి.
కనిపించని టీ..
చెన్నైలోని చాలా దుకాణాల్లో గ్యాస్ వాడకాన్ని తగ్గిస్తున్నారు. స్టౌపై టీ కూడా తయారుచేయడంలేదు. చిన్నచిన్న టీకొట్టుల్లో ఇది అమలవుతోంది. ‘ఇదివరకు స్టౌపై టీ పెట్టి వేడివేడిగా ఇచ్చేవారు. ఇప్పుడు కంటైనర్ స్టోరేజీలు వాడి గ్లాసుల్లో పోస్తున్నారు. గ్యాస్ కొరతకు ఇది ప్రత్యక్ష నిదర్శనంగా ఉంది’ అంటున్నారు నగరవాసులు.
ఇవి కూడా చదవండి

భారీగా కట్టెల ఆర్డర్లు
చెన్నై వ్యాప్తంగా కట్టెలు, వంట చెరకుకు డిమాండ్ ఏర్పడింది. గ్యాస్ కొరతతో కట్టెల పొయ్యిపై వంటలు చేసేందుకు ఇప్పటికే పలు హోటళ్లు ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇడ్లీ, వడ, సాంబార్ ఇలా చాలావాటిని కట్టెల పొయ్యిపైనే చేస్తున్నాయి. మరోవైపు పెద్ద హోటళ్లు కరెంటు ద్వారా వంటల్ని చేస్తున్నారు. గత రెండ్రోజుల్లో ఈ తరహా మార్పు చోటుచేసుకుంది. భవిష్యత్తులో మరిన్ని ప్రత్యామ్నాయాలు తెచ్చేలా చర్చలు కొనసాగిస్తున్నామని యజమానులు చెబుతున్నారు.
10వేల హోటళ్లపై ప్రభావం
చెన్నైలో 24గంటలు పనిచేసే 10వేల హోటళ్లున్నాయి. చిన్న హోటళ్లు రోజుకు 3 సిలిండర్ల అవసరముంటుంది. మధ్యతరహా హోటళ్లకు 5-10, స్టార్ రేటింగ్ హోటల్స్కు కనీసం 20 అవసరం. ఇప్పుడున్న స్టాక్ ప్రకారం బుధవారంతో సిలిండర్లు అయిపోయే పరిస్థితి ఉందని హోటల్ యజమాన్యాలు చెబుతున్నాయి. దోశ, పూరీ, ఇతర టిఫిన్ తయారీ హోటళ్లు అత్యవసరంగా పనిగంటలు తగ్గించుకున్నట్లు ప్రకటించాయి. టిఫిన్ చేసినవారు టీ, కాఫీ అడిగినా ఆయా హోటళ్లు తయారుచేయడంలేదు. వాటికి గ్యాస్ ఎక్కువగా ఖర్చువుతుందని చెప్పేస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని విన్నవించామని, త్వరలో మార్పు వస్తుందని అనుకుంటున్నామని హోటల్ సంఘాలు చెబుతున్నాయి.
ఏజెన్సీల వద్ద వరుస..
సిలిండర్ బుకింగ్ కోసం ప్రజలు ఎండలో వరుస కడుతున్నారు. సిలిండర్లు ఫోన్లో బుక్ కాకపోవడంతో ప్రజలు ఏజెన్సీల వద్దకు వెళుతున్నారు. రాష్ట్రంలో ఆటోలు, కార్లకు వినియోగించే సీఎన్జీ స్టేషన్లు చెన్నై, కోవై తదితర నగరాల్లో బుధవారం ఉదయం నుంచే మూతబడ్డాయి. చెన్నైలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్టేషన్లు తెరిచి ఉండటంతో ఆటోలు, కార్లు గంటల కొద్దీ వరుసలో నిల్చుంటున్నాయి. పెట్రోల్ ద్వారా నడిచే ఆటోల ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి








