LPG Shortage: ఎల్పీజీ కొరతతో కుదేలైన ఫుడ్ డెలివరీ.. ఉపాధి కోల్పోతున్న గిగ్ వర్కర్లు!
పశ్చిమాసియా (Middle East) ఉద్రిక్తతల ప్రభావం కేవలం ఇంధన ధరలకే పరిమితం కాకుండా, భారతీయ ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్ రంగాలపై తీవ్రంగా పడుతోంది. ఎల్పీజీ (LPG Shortage) గ్యాస్ కొరత కారణంగా చిన్న హోటళ్ల నుంచి క్లౌడ్ కిచెన్ల వరకు మూతపడుతుండటంతో.. స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థల్లో పనిచేసే డెలివరీ ఏజెంట్ల (Gig Workers) దినసరి ఉపాధికి తీవ్ర ముప్పు వాటిల్లింది.
సగానికి పడిపోయిన ఆర్డర్లు..
గ్యాస్ కొరతతో (LPG Shortage) దాబాలు, క్యాటరింగ్ సేవలు, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఫుడ్ ఆర్డర్లు ఏకంగా 50-60 శాతం మేర పడిపోయాయి. రోజుకు 30 ఆర్డర్లు డెలివరీ చేస్తూ ఉపాధి పొందే ఏజెంట్లకు, ఇప్పుడు కనీసం 5 నుంచి 10 ఆర్డర్లు కూడా రావడం గగనంగా మారింది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఐడీల రద్దు ముప్పు..
సరైన పని (ఆర్డర్లు) లేకపోవడంతో డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు ఏజెంట్ల ఐడీలను ఇన్‌యాక్టివ్ (In-active) చేసే ప్రమాదం ఉందని ‘గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్’ (GIPSWU) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎటువంటి సామాజిక భద్రత, స్థిరమైన నెలవారీ వేతనాలు లేని ఈ కార్మికులు.. ఇలాంటి ఆకస్మిక ఆర్థిక సంక్షోభాల (LPG Shortage) సమయంలో తీవ్రంగా నష్టపోతున్నారని యూనియన్ వాపోతోంది.
యూనియన్ ప్రధాన డిమాండ్లు ఇవే..
ఈ విపత్కర పరిస్థితుల్లో (LPG Shortage) కార్మికులను ఆదుకునేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ యూనియన్ ప్రతినిధులు కేంద్ర కార్మిక శాఖకు లేఖ రాశారు. వారి ప్రధాన డిమాండ్లు ఏంటంటే.. ఆగిపోయిన ఆహార వ్యాపారాలకు 24 గంటల పాటు నిరంతర ఎల్పీజీ గ్యాస్ (LPG Shortage) సరఫరాను పునరుద్ధరించాలి. స్విగ్గీ, జొమాటో లాంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు ఉపాధి కోల్పోయిన డెలివరీ ఏజెంట్లకు తక్షణ పరిహారంగా రూ. 10,000 చెల్లించాలి. ఏజెంట్ల వర్క్ ఐడీలపై 3 నెలల పాటు మారటోరియం విధించాలి. ‘సామాజిక భద్రతా కోడ్-2020’ కింద గిగ్ వర్కర్లందరికీ పూర్తిస్థాయి కవరేజీ కల్పించాలి. మొత్తానికి, ఎల్పీజీ సరఫరాలో (LPG Shortage) ఏర్పడిన చిన్న అంతరాయం.. లక్షలాది మంది యువత రోజువారీ బతుకుదెరువును ఎలా దెబ్బతీస్తుందో తాజా పరిస్థితి కళ్లకు కడుతోంది.
ఇవి కూడా చదవండి








