Fuel Shortage: దేశంలో ఇంధన కొరత లేదు: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి
దేశంలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ (Fuel Shortage) కొరత ఏర్పడిందంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పార్లమెంట్ వేదికగా ఆ ఊహాగానాలకు చెక్ పెట్టింది. భారతదేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. గురువారం పార్లమెంటులో జరిగిన చర్చలో ఆయన దేశ ఇంధన భద్రత, సరఫరా పరిస్థితులపై సవివరమైన ప్రకటన చేశారు.
నిల్వలు పుష్కలం.. ఆందోళన వద్దు..
ప్రస్తుతం దేశంలో ఇంధన సరఫరా వ్యవస్థలు (సప్లై చైన్) అత్యంత స్థిరంగా పనిచేస్తున్నాయని మంత్రి వెల్లడించారు. “మన దేశ అవసరాలకు మించిన ఇంధన నిల్వలు మన వద్ద సురక్షితంగా ఉన్నాయి. కొరత (Fuel Shortage) వస్తుందన్న భయంతో ప్రజలు ఒకేసారి అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేయడం (ప్యానిక్ బయ్యింగ్) వల్లే క్షేత్రస్థాయిలో కొన్నిచోట్ల తాత్కాలిక ఒత్తిడి కనిపిస్తోంది. నిజానికి దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదు” అని ఆయన కుండబద్దలు కొట్టారు.
28 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి..
సామాన్యుల గృహ వినియోగానికి అత్యంత కీలకమైన ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై ఆయన ప్రత్యేక భరోసా ఇచ్చారు. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని తమ ప్రభుత్వం ఏకంగా 28 శాతం మేర పెంచిందని సభకు తెలియజేశారు. అంతర్జాతీయంగా ఎన్ని భౌగోళిక ఉద్రిక్తతలు, సంక్షోభాలు (Fuel Shortage) తలెత్తినప్పటికీ.. గృహ అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందస్తు చర్యలు తీసుకున్నట్లు హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
దిగుమతుల విస్తరణ..
గతంలో ఇంధన దిగుమతుల (Fuel Shortage) కోసం ఒకే మార్గంపై అతిగా ఆధారపడే పరిస్థితి ఉండేదని పూరి గుర్తుచేశారు. ఒకప్పుడు భారత దిగుమతుల్లో 60 శాతం ఎల్పీజీ, 45 శాతం ముడి చమురు కేవలం పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలకు కేంద్ర బిందువైన ‘హోర్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) గుండానే వచ్చేదన్నారు. భవిష్యత్తులో ప్రాంతీయ ఉద్రిక్తతల వల్ల ఆ మార్గంలో ఆటంకాలు ఏర్పడితే దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉంటుందన్న ముందుచూపుతో, కొనుగోళ్లను ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు విస్తరించామని మంత్రి వివరించారు.
ప్రస్తుతం పరిస్థితులను అంచనా వేసి, హోర్ముజ్ జలసంధి గుండా వచ్చే చమురు కన్నా అత్యవసరాల (Fuel Shortage) కోసం మనం నిల్వ చేసిన వ్యూహాత్మక రిజర్వులే ఎక్కువగా ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఏ దేశంలో సంక్షోభం (Fuel Shortage) వచ్చినా మన ఇంధన సరఫరాకు ఢోకా లేదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి








