NTA ప్రక్షాళ దిశగా కేంద్రం అడుగులు… 47 మంది ఔట్
జాతీయ పరీక్షా సంస్థ (NTA) ప్రక్షాళన దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది.ఎన్ఏటీలో పనిచేస్తున్న 47 మంది అధికారులను తొలగించింది కేంద్రం. ఎన్ఏటీ పూర్తి ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగానే ఈ పని చేసినట్లు, వీరిలో కొందరిపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకునే అవకాశం వుందని తెలిపారు.ఇంతటితో కాకుండా.. వచ్చె నెల నాటికి పూర్తి ప్రక్షాళన చేయాలన్న యోచనలో కేంద్రం వుంది.
అందులో విధులు నిర్వహిస్తున్న 47 మంది అధికారులపై వేటువేసిన ప్రభుత్వం.. అనేక పోటీ పరీక్షలు, నియామక పరీక్షలు నిర్వహిస్తున్న ఎన్టీఏలో సంపూర్ణ మార్పులను చేపట్టింది. పరీక్ష పేపర్ల లీకేజ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలకు కేంద్రం నడుం బిగించింది. పరీక్ష పత్రాల లీకేజ్లకు కఠినమైన శిక్షలను ఖరారు చేసే ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లీకేజ్ బాధ్యులకు 10 ఏండ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా గరిష్ఠంగా విధించేలా చట్టంలో మార్పులు తీసుకువచ్చే ముసాయిదా బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.








