పేపర్ లీక్ లకు చెక్ పెట్టే బిల్లు తెస్తున్నాం.. ప్రధాని మోదీ అర్ధరాత్రి వీడియో సందేశం
దేశంలో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి ఓ వీడియో సందేశాన్ని పంపారు. పేపర్ లీక్ లకు చెక్ పెట్టే బిల్లుపై శుక్రవారం జరిగే కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అతి త్వరలో దానిని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదిస్తామని కూడా ఆ వీడియోలో ప్రకటించారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో 12 గంటల వ్యవధిలో ఈ అంశంపై వీడియో విడుదల చేయడం ఇది రెండో సారి.
‘‘స్నేహితులారా… పేపర్ లీక్ సాధారణమేమీ కాదు. ఈ విషయం నాకు బాగా తెలుసు. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశాం, జైలుకీ పంపాం. మా అంత్యంత ప్రాధాన్యతా అంశం విద్యార్థులు అకాడమిక్ ఇయర్ ని నష్టపోవద్దనే. అందుకే వెంటనే పరీక్షలు కూడా నిర్వహించాం. అంతటితో చేతులు దులుపుకోలేదు. తల్లిదండ్రులకు, పిల్లలకు కూడా ఇది సీరియస్ అంశమని మాకు తెలుసు. రెండున్నర నెలల్లో పలు చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు మరిన్ని చర్యలు తీసుకుంటాం. అందుకే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు.’’ అని మోదీ ప్రకటించారు.








