మీ జీవితాన్ని కంట్రోల్ చేస్తున్న సీక్రెట్ ఆల్గోరిథమ్!
Instagramకి ఓ Algorithm ఉంది.
YouTubeకి ఓ Algorithm ఉంది.
అలాగే మన జీవితానికి కూడా ఓ Algorithm ఉందని మీకు తెలుసా?.
ఇన్‌స్టాగ్రామ్‌లో కంటిన్యూగా ఒకే రకమైన వీడియోలను పదే పదే చూస్తే, కొన్ని రోజుల్లో మీ మొత్తం ఫీడ్ అలాంటి వీడియోలతో నిండిపోతుంది. ఎందుకంటే ఆ యాప్ ” వీళ్లకు ఇవే ఇష్టం” అని ఒక నిర్ణయం తీసుకుంటుంది.
జీవితం కూడా దాదాపు అదే చేస్తుంది. మీరు ఇతర్ల ఆలస్యాన్ని భరిస్తే అది మీ జీవితంలో నార్మల్ అయిపోతుంది. మీరు అవమానాన్ని భరిస్తే అదే మీకు మళ్లీ మళ్లీ అదే ఎదురవుతుంది. మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అదే మీ కొత్త జీవనశైలిగా మారుతుంది. జీవితం మీ గోల్స్‌ని చూడదు, మీ విజన్ బోర్డ్‌ని కూడా పట్టించుకోదు. మీరు ప్రతిరోజూ ఏది అంగీకరిస్తున్నారో దాన్నే మీ జీవితానికి డిఫాల్ట్ సెట్టింగ్‌గా మార్చేస్తుంది. అదే Life Algorithm.
ఫోన్ స్లో అయినట్లే… లైఫ్ కూడా లాగ్ అవుతోందా?
ఇది వినడానికి కాస్త కఠినంగా అనిపించొచ్చు, కానీ మీ ఫోన్‌ను ఒక్కసారి గుర్తు చేసుకోండి. కొత్త ఫోన్ కొన్నప్పుడు అది ఎంత ఫాస్ట్‌గా ఉంటుంది? ఆరు నెలల తర్వాత ఎందుకు స్లో అవుతుంది? అది ఒక్కరోజులో జరగదు. రోజూ అవసరం లేని యాప్స్, అనవసరమైన ఫైల్స్, చిన్న చిన్న జంక్ చేరి చివరికి మొత్తం సిస్టమ్‌ని స్లో చేస్తాయి. మన జీవితాలు కూడా అలాగే పాడవుతాయి. ఒక పెద్ద తప్పు వల్ల కాదు, రోజూ మనం “పర్లేదులే” అని డిలీట్ చేయకుండా వదిలేసే చిన్న చిన్న విషయాల వల్ల.
డైలీ 5 మినిట్స్ గేమ్ చేంజర్!
జేమ్స్ క్లియర్ తన ‘అటామిక్ హ్యాబిట్స్’లో ఒక ఆసక్తికరమైన విషయం చెబుతాడు. మన జీవితాన్ని మార్చేది ఒక భారీ నిర్ణయం కాదు. చాలా చిన్న ప్రవర్తనలు… అవి రోజూ రిపీట్ అవుతూ మన కొత్త వ్యక్తిత్వాన్ని తయారు చేస్తాయి. అందుకే మీరు ప్రతి రోజు ఐదు నిమిషాలు చదివినా లేదా ప్రతి రోజు ఐదు నిమిషాలు వృథా చేసినా రెండూ చిన్నవే, కానీ రెండూ ఒకే చోటికి తీసుకెళ్లవు.ఒకటి ఎత్తుకి, ఒకటి క్రిందకి దారి చూపెడతాయి.
ఇవి కూడా చదవండి
“నెవర్ కాంప్రమైజ్” స్టాండర్డ్స్
ఇక్కడే చాలామంది గోల్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. విజయం సాధించిన వాళ్లు మాత్రం “నేను ఏ స్థాయి కంటే దిగువకు వెళ్లను?” అనే మరొక విషయం గురించి ఆలోచిస్తారు. అదే స్టాండర్డ్. వారెన్ బఫెట్‌ను ప్రపంచంలో గొప్ప ఇన్వెస్టర్‌గా నిలబెట్టింది కేవలం మంచి కంపెనీలను ఎంచుకోవడం కాదు, తనకు పనికి రాని కంపెనీలను తిరస్కరించడం. ఎంత లాభం కనిపించినా నిజాయితీ లేని మేనేజ్మెంట్ ఉంటే ఆయన పెట్టుబడి పెట్టడు. ఎంత పెద్ద అవకాశం అయినా తన ప్రమాణాల కంటే తక్కువైతే నేరుగా వెనక్కి తిరుగుతాడు.
రాంగ్ వైబ్స్… నో చాన్స్!
ఒకసారి బఫెట్ చెప్పిన “You can’t make a good deal with a bad person.” అనే మాట ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్ అవుతుంది. ఆ ఒక్క వాక్యం పెట్టుబడులకు మాత్రమే కాదు, జీవితానికీ వర్తిస్తుంది. తప్పు మనుషులతో మంచి భవిష్యత్తు నిర్మించలేరు, తప్పు అలవాట్లతో మంచి ఆరోగ్యాన్ని నిర్మించలేరు, తప్పు ప్రమాణాలతో గొప్ప జీవితాన్ని నిర్మించలేరు.
మొదట్లో అందరికీ నచ్చదు
మీరు మీ స్టాండర్డ్ పెంచిన రోజు… కొంతమందికి మీరు మారిపోయినట్టు అనిపిస్తుంది. “ఎంత ఆటిట్యూడ్!”
“ఇంత సీరియస్ ఎందుకు?” “ముందులా లేవు.” అని అంటారు. ఎందుకంటే మీ పాత బౌండరీల వల్ల లాభపడిన వాళ్లే ముందుగా అసహనం చూపిస్తారు. అది తప్పు కాదు. అది మీ మార్పు మొదలైందనే సంకేతం.
ఒక బోల్డ్ “NO” తో సీన్ మార్చేయండి!
స్టీవ్ జాబ్స్ ఒకసారి “Focus is saying no to a hundred good ideas.” అని అన్నాడు. ఆ మాటలోని అసలు శక్తి “No”లో ఉంది. విజయం అంటే ప్రతి అవకాశాన్ని పట్టుకోవడం కాదు, మీ జీవితాన్ని ప్రక్కకు లాగి, క్రిందకు తోసే వాటిని గుర్తించి వదిలేయడం. అందుకే మన జీవితాన్ని మార్చడానికి ప్రతీ రోజు కొత్త గోల్ అవసరం లేకపోవచ్చు, ఒక కొత్త “No” మాత్రం కావాలి.
ప్రతిరోజూ మీరు మీకు మీరే చెప్పుకునే ఒక చిన్న మాట. “ఇది నా స్టాండర్డ్ కంటే తక్కువ… నేను దీన్ని అంగీకరించను.” ఆ ఒక్క నిర్ణయం…మీ కెరీర్‌ను మార్చవచ్చు.మీ ఆరోగ్యాన్ని మార్చవచ్చు. మీ సంబంధాలను మార్చవచ్చు. చివరికి… మీ మొత్తం జీవితాన్నే మార్చేయగలదు.








