24th July 2026

_________

- Saidulu

ముచ్చటైన చేతులకు... మురిపించే కోలం కడ బ్రాస్‌లెట్ కలెక్షన్స్..  ఓ లుక్కేసేయండి !

మన సంప్రదాయ ఇంటి ముంగిట ముగ్గుల అందం ఇప్పుడు మెరిసే స్టోన్ బ్రాస్‌లెట్‌గా మారింది. ఈ ట్రెండీ డిజైన్ అందరినీ ఆకట్టుకుంటోంది!

గోల్డ్ బ్యాంగ్‌పై వజ్రాల తరహా రాళ్లతో మెరిసే సిక్కు కోలం డిజైన్ రాయల్ లుక్ ఇస్తుంది. పట్టు చీరలపైకి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్!

సిక్కు కోలం మోడల్

పవిత్రతకు చిహ్నమైన స్వస్తిక్, మెలికల ముగ్గు ఆకారంలో మెరిసే రాళ్లతో చెక్కిన ఈ కడ శుభకార్యాలకు ధరించడానికి ఎంతో ప్రత్యేకం.

స్వస్తిక్ ముగ్గు శైలి డిజైన్

చతురస్రాకారపు గ్రిడ్ ముగ్గు ఆకారంలో రాళ్లను అమర్చి రూపొందించిన ఈ డిజైన్ మోడ్రన్, ఎత్నిక్ వేర్ రెండింటికీ చక్కగా సరిపోతుంది.

గ్రిడ్ కోలం స్టోన్ బ్రాస్‌లెట్

పూల ముగ్గును పోలిన ఆకారంలో రూపొందించిన ఈ కడ బ్రాస్‌లెట్ చేతికి ఎంతో సున్నితమైన, ఆకర్షణీయమైన లుక్‌ని అందిస్తుంది.

పువ్వుల ముగ్గు డిజైన్

వంపు తిరిగిన లూప్స్, మెరిసే స్టోన్స్ కాంబినేషన్‌లో వచ్చే ఈ డిజైన్ సంప్రదాయ ముగ్గుల పాఠాలను గుర్తుచేస్తూ ఎంతో ట్రెండీగా ఉంది.

ట్రెడిషనల్ లూప్ ముగ్గు కడ

స్లిమ్ గోల్డ్ బ్యాండ్‌పై ముగ్గు డిజైన్ ఉండే ఈ కడలు ఆఫీస్‌కు లేదా రోజువారీ వినియోగానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి.

డెయిలీ వేర్ కడ డిజైన్స్

మన సాంస్కృతిక ముగ్గుల అందాన్ని ఫ్యాషన్ జ్యువెలరీగా మార్చిన ఈ వైరల్ కోలం కడలతో మీ శైలిని మరింత ప్రత్యేకంగా మార్చుకోండి!