“ఆమెతో కలసి స్టెప్స్ వేయాలని ఉంది” : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఇద్దరు హీరోలకు ఒక హీరోయిన్ అంటే చాలా ఇష్టం. కానీ ఆ హీరోయిన్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈ స్టార్ హీరోలు ఇద్దరు ఆమెతో ఒక్క సారి అయినా డ్యాన్స్ చేయాలని ముచ్చటపడ్డారటా! తెలుగు చిత్రసీమలో డ్యాన్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ముందొచ్చే పేర్లు మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తమ అద్భుతమైన గ్రేస్, ఎనర్జీ, స్టెప్పులతో దశాబ్దాలుగా ప్రేక్షకులని అలరిస్తున్న ఈ “మామా-అల్లుడు” కాంబినేషన్ వెండితెరపై డ్యాన్స్‌కు ఒక కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అలాంటి దిగ్గజ డ్యాన్సర్లు సైతం ఒకే ఒక్క హీరోయిన్‌తో కలిసి డ్యాన్స్ చేయాలని బహిరంగంగా తమ ఆకాంక్షను వ్యక్తం చేశారంటే ఆ నటి టాలెంట్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రత్యేకమైన హీరోయిన్ మరెవరో కాదు… లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి….
‘ఫిదా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి, తొలి సినిమాతోనే తన నటనతో, అంతకుమించి తన డ్యాన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. రౌడీ బేబీ, సారంగ దరియా, వచ్చండే వంటి పాటల్లో ఆమె వేసిన స్టెప్పులు ఇండియన్ సినీ పరిశ్రమనే ఊపేసాయి. సహజ సిద్ధమైన ఎక్స్ప్రెషన్స్, మెరుపు లాంటి మూమెంట్స్‌తో ఆమె చేసే డ్యాన్స్ చూసి అభిమానులే కాదు, సినీ దిగ్గజాలు కూడా ఫిదా అయిపోయారు.
టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్లలో అల్లు అర్జున్ ఒకరు. అంతర్జాతీయ స్థాయిలో తన స్టెప్పులతో గుర్తింపు తెచ్చుకున్న బన్నీ, ఒక వేడుకలో సాయి పల్లవి డ్యాన్స్ ప్రతిభను విపరీతంగా ప్రశంసించారు. “సాయి పల్లవి ఎంతో అద్భుతమైన డ్యాన్సర్. ఆమెతో కలిసి ఒక పాటలోనైనా, కనీసం ఒక్క బిట్లోనైనా డ్యాన్స్ చేయాలని నాకు ఎప్పటినుంచో ఆశగా ఉంది” అని ఓపెన్‌గా చెప్పారు. ది బెస్ట్ ఫిమేల్ డ్యాన్సర్ గా ఒక హీరోయిన్‌కు ఇలాంటి ప్రశంస దక్కడం నిజంగా సాయి పల్లవి టాలెంట్ కే నిదర్శనం.








