Strait of Hormuz: హార్మోజ్ లో భారత హీరోలు, ‘డార్క్ మోడ్’ తో ముంబైకి ఎంట్రీ!!
హార్మోజ్ జలసంధిలో యుద్ధ ఉద్రిక్తతల మధ్య భారత నౌకలు అనుసరించిన ‘డార్క్ మోడ్‘ (Dark Mode) వ్యూహం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా హార్మోజ్ జలసంధిలో ప్రయాణం చాలా కష్టంగా మారింది. 55 కిలోమీటర్ల దూర ప్రాంతం ఉన్న ఈ జలసంధిలో ఎప్పుడు ఏ క్షిపణి దాడి చేస్తుందో అర్ధంకాక భయపడుతున్నారు. ఇలాంటి టైంలో భారత నౌకలు ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల నుండి తప్పించుకుని భారత్ చేరుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి

ఇలా తప్పించుకోవడానికి ఏఐఎస్(Automatic Identification System) అనే ట్రాకింగ్ వ్యవస్థను నిలిపివేసి రహస్యంగా తమ ప్రయాణం సాగించాయి. అసలు ఈ ఏఐఎస్ (AIS) అంటే ఏమిటి? దానిని ఎందుకు ఆపాల్సి వచ్చిందో చూద్దాం. సముద్రాలలో ప్రయాణం చేసే నౌకలు తమ వేగం లేదంటే వాటి పేరు, దిశ, ఎక్కడ ఉన్నాయో తెలిపేందుకు ‘ఏఐఎస్’ అనే రేడియో వ్యవస్థను వాడుకుంటాయి. ఈ యుద్ద సమయంలో ఆ వ్యవస్థను ఆపేసి ప్రయాణం చేసాయి. ఈ సిగ్నల్ ఆన్ చేసి ఉంటే.. నౌక ఎక్కడ ఉందో తెలుసుకోవడం చాలా ఈజీ.
దీనిని కంట్రోల్ చేయడానికి, భారత కెప్టెన్ల నేతృత్వంలోని ‘షెన్లాంగ్’ వంటి భారీ చమురు ట్యాంకర్లు జలసంధిలోకి ప్రవేశించే ముందు తమ ట్రాకింగ్ సిస్టంను ఆపేశాయి. దీనినే టెక్నికల్ భాషలో గోయింగ్ డార్క్ లేదా డార్క్ మోడ్ అంటారు. సుమారు 1.35 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురుతో ప్రయాణిస్తున్న నౌకను ఏ విధమైన ట్రాకింగ్ లేకుండా, కేవలం అనుభవం, యుద్ధ నౌకల పరోక్ష సహకారంతో నడపడం సామాన్యమైన విషయం కాదు. కెప్టెన్ సుక్షాంత్ సింగ్ సంధు నేతృత్వంలోని బృందం మార్చి 8న జలసంధిలో అదృశ్యమై, విజయవంతంగా మార్చి 9న తిరిగి ట్రాకింగ్ స్క్రీన్లపై ప్రత్యక్షమైంది. సముద్రం అడుగున ఉండే ఇరాన్ డ్రోన్ల ముప్పు ఉన్నప్పటికీ, మన సిబ్బంది వెనకడుగు వేయకుండా ముంబై తీరానికి సురక్షితంగా చమురును చేర్చారు.
ఇవి కూడా చదవండి








