Strait of Hormuz: హర్మూజ్ జలసంధి మూతపడితేనే అసలు చిక్కంతా.. ప్రపంచం తలకిందులు : ఐరాస
పశ్చిమాసియా ఘర్షణలతో హర్మూజ్ జలసంధి మూతపడితే ప్రపంచ వాణిజ్యం, అభివృద్ధిపై పెను ప్రభావమే పడుతుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. దాని వల్ల ఆహార ధరలు, జీవన వ్యయాలు పెరుగుతాయని పేర్కొంది. ఈ మేరకు ఐరాస అనుబంధ సంస్థ యూఎన్ సీటీఏడీ తన నివేదికలో ఈ విషయాలను పొందుపరిచింది.
సైనిక ఘర్షణల ప్రభావాలు పశ్చిమాసియాకే పరిమితం కావని, ప్రపంచ ఇంధన మార్కెట్లు, సముద్ర రవాణా, అంతర్జాతీయ సరఫరా గొలుసులపైనా ప్రభావం వుంటుందని తెలిపింది. ఇంధనం, ఎరువుల ధరలతో పాటు రవాణా ఛార్జీలు, బీమా ప్రీమియంలు పెరిగిపోతే ఆహార ధరలు, జీవన వ్యయాలకు రెక్కలొస్తాయని, ఈ పరిణామాల వల్ల ప్రత్యేకించి పేదలు ఇబ్బందిపడతారని కూడా హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
‘అంతర్జాతీయ వాణిజ్యం, అభివృద్ధికి అంతరాయాన్ని తొలగించాలన్నా, పర్యావరణ ముప్పును తగ్గించాలన్నా పశ్చిమాసియాలో సైనిక ఉద్రిక్తతలను తగ్గించడమే ఏకైక మార్గం. సముద్ర రవాణా మార్గాలు, ఓడరేవులు, సముద్ర రవాణా మౌలిక సదుపాయాలు, నావికుల పరిరక్షణకు చర్యలను చేపట్టాలి. అంతర్జాతీయ చట్టాలు, రవాణా స్వేచ్ఛకు అనుగుణంగా వాణిజ్య మార్గాలకు భద్రతను కల్పించాలి. ప్రస్తుత సైనిక ఘర్షణ వల్ల పశ్చిమాసియాతో పాటు యావత్ ప్రపంచంపైనా ఆర్థికపరమైన ప్రభావం పడుతుంది. ఈ ఘర్షణ ఎంత కాలం కొనసాగుతుంది? దీని తీవ్రత ఎలా ఉంటుంది? ఎన్ని దేశాల పరిధిలో ఘర్షణ జరుగుతుంది? అనే అంశాలు ఆర్థిక ప్రభావం స్థాయిని నిర్ణయిస్తాయి.అని పేర్కొంది.
ఫిబ్రవరి 28న ఇరాన్, అమెరికా – ఇజ్రాయెల్ సైనిక ఘర్షణ మొదలైంది. అప్పటి నుంచి హర్మూజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలు 97 శాతం మేర తగ్గిపోయాయి. దీనివల్ల ప్రధానంగా ఆసియా దేశాలు ప్రభావితం అవుతున్నాయి. ఆయా దేశాలకు ఇంధన వనరుల సప్లైలపై ఎక్కువ ఎఫెక్ట్ పడుతోంది. 2024లో ప్రతిరోజూ హర్మూజ్ మీదుగా సప్లై అయిన ముడి చమురు(14.3 మిలియన్ బ్యారెళ్లు)లో 84 శాతం ఆసియా దేశాలకే వెళ్లింది. కేవలం 16 శాతమే ఐరోపా దేశాలు, ఇతర ప్రాంతాలకు సప్లై అయింది.అని కూడా నివేదిక పేర్కొంది.
ఇవి కూడా చదవండి








