Kondagattu: కొండగట్టుకు కేంద్రమంత్రి బండిసంజయ్ పాదయాత్ర
కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అంజన్న ఆశీర్వాద యాత్ర పేరిట కరీంనగర్లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు (Kondagattu) వరకు మహా పాదయాత్ర చేపట్టారు. కేంద్ర మంత్రితో పాటు ఇటీవల గెలుపొందిన కార్పొరేటర్లు (Corporators) ఆయన వెంట ఉన్నారు. కరీంనగర్ మేయర్ (Mayor) పీఠం బీజేపీ కైవసమైతే కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కలిసి కొండగట్టు అంజన్న ఆలయానికి కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకుంటానని ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ ప్రకటించారు. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, 10 వేల మంది కార్యకర్తలతో కలిసి సంజయ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








