నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీశ్ (Sana Satish), చింతకాయల విజయ్ (Chintakayala Vijay), భాష్యం రామకృష్ణ (Bhashyam Ramakrishna) నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి, నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతుకుముందు టీడీపీ కేంద్ర కార్యాలయంలో వద్ద ఎన్టీఆర్ (NTR statue) విగ్రహానికి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్లో మÖడు రాజ్యసభ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.








