ఇరాన్ ఈక్వేషన్స్.. అమెరికాకు అర్థమవుతున్నాయా..?
మా ప్రతిపాదనలే తిరస్కరిస్తారా.. మీపై దాడులు చేస్తాం. మిమ్మల్ని గుక్క తిప్పుకోనివ్వం.. మీ నౌకల్ని కదలనివ్వం..మిమ్మల్ని దిగ్భందనం చేస్తాం. మీరు అల్లాడిపోవాల్సిందే.. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గర్జనలు. అయితే వీటిని ఇరాన్ మాత్రం బేఖాతర్ చేస్తోంది. ప్రశ్నేలేదు.. ఏం చేస్తారో చేసుకోండి. మేం అన్నింటికీ సిద్ధమంటూ ఎదురు నిలిచి గర్జిస్తోంది. దీనికి తోడు మాతోటి కయ్యం.. మీకే నష్టంజాగ్రత్త అంటూ సుద్దులు చెబుతోంది. అది కూడా మ్యాథ్స్ పరిభాషలో..
ఇవి కూడా చదవండి
చర్చలు విఫలమైన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన బెదిరింపులకు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ వ్యంగ్యంగా బదులిచ్చారు. పెట్రోల్ ధరలు తలచుకొని అమెరికన్లు బాధపడతారని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అలాగే కొన్ని మ్యాథ్ సింబల్స్‌ను షేర్ చేశారు.
‘‘ప్రస్తుతం ఉన్న ధరలను ఎంజాయ్ చేయండి. ఇప్పుడు 4 నుంచి 5 డాలర్ల మధ్య ఉన్న పెట్రోల్ ధరలను తలచుకొని దిగ్బంధం తర్వాత ఎలాగూ బాధపడతారు’’ అని స్పీకర్ రాసుకొచ్చారు. తర్వాత ‘ΔO_BSOH>0 ⇒ f(f(O))>f(O)’ అని ఒక ఈక్వేషన్ షేర్ చేశారు. అమెరికా గ్యాస్ ధరలను చూపిస్తోన్న మ్యాప్‌ను పోస్టులో ప్రస్తావించారు. అయితే ఇప్పుడు ఆ మ్యాథ్ ఫార్ములా అర్థమేంటా..? అని నెట్టింట ఆరా మొదలైంది.
‘‘దిగ్బంధంతో (Delta O_{BSOH}>0).. చమురు ధరలు సాధారణంగా కాకుండా అమాంతం పెరుగుతాయి (f(f(O))>f(O))’’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ‘‘సరఫరా పరిమితం అవుతుంది.. ఆ తర్వాత ధరలు పెరుగుతాయి.. దాంతో ఒత్తిడి తీవ్రమవుతుంది. అందుకే చౌకగా ఉన్నంతకాలం ఆ ధరలను ఆస్వాదించండి’’ అని మరో యూజర్ దీనికి అర్థం చెప్పారు.
ఇవి కూడా చదవండి








