Mukhesh Ambani: భవిష్యత్తులో వందల ‘రిలయన్స్’లు వస్తాయి: ముఖేష్ అంబానీ
భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన వృద్ధి పథంలో ఉందని, భవిష్యత్తులో రిలయన్స్ వంటి సంస్థలు వందల సంఖ్యలో పుట్టుకొస్తాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ (Mukhesh Ambani) జోస్యం చెప్పారు. బుధవారం జరిగిన ‘జియో-బ్లాక్రాక్’ (Jio-BlackRock) కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో స్థిరమైన నాయకత్వం, కీలక పాలసీల వల్ల రెండంకెల వృద్ధి (Double-digit growth) సాధ్యమేనని స్పష్టం చేశారు.
దేశ దీర్ఘకాలిక ప్రగతి ఇంధన భద్రతపైనే ఆధారపడి ఉందని అంబానీ (Mukhesh Ambani) పేర్కొన్నారు. రాబోయే దశాబ్దంలో ప్రస్తుతం ఉన్న 80 శాతం ఇంధన దిగుమతులను గణనీయంగా తగ్గించుకోవాలని, అప్పుడే దేశం ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందని సూచించారు. మౌలిక వసతుల కల్పన వల్ల స్టార్టప్స్ దూసుకుపోతున్నాయని వెల్లడించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇదే వేదికపై బ్లాక్రాక్ సీఈఓ లారీ ఫింక్ మాట్లాడుతూ.. రాబోయే 20-25 ఏళ్లు భారత్వేనని, దీన్ని ‘ఎరా ఆఫ్ ఇండియా’ (Era of India)గా అభివర్ణించారు. వచ్చే దశాబ్దంలో భారత్ 8-10 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. డిజిటల్ చెల్లింపుల విషయంలో అమెరికా కంటే భారత్ ఎంతో ముందుందని, మోదీ (PM Modi) ప్రభుత్వ పాలసీలు అద్భుతమని ఆయన ప్రశంసించారు. తాను పెట్టుబడి పెట్టాలనుకునే ఏకైక దేశం భారతేనని స్పష్టం చేశారు.






