Ys Sharmila: జగన్కు ఆ దమ్ము లేదా? ఆస్తుల గొడవపై షర్మిల షాకింగ్ కామెంట్స్..!
గత నాలుగేళ్ల నుంచి వైఎస్ కుటుంబంలో విభేదాలు సంచలనం అవుతున్నాయి. తాజాగా ఆస్తుల వివాదం, వైఎస్ వివేకా (Ys Viveka)హత్య కేసు అంశం మరోసారి కలకలం రేపాయి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Ys Sharmila) తన సోదరుడు, మాజీ సీఎం జగన్పై(ys jagan) తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వివేకా హత్య కేసు గురించి అడిగితే.. జగన్ అండ్ కో ఆస్తుల గురించి మాట్లాడుతున్నారంటూ షర్మిల నిప్పులు చెరిగారు. ‘ఇంకొకరి ఆస్తిని అనుభవిస్తోంది నేను కాదు.. జగన్’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
అసలు విజయమ్మ లేఖపై జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ షర్మిల నిలదీశారు. షర్మిల తన తాజా ప్రసంగంలో కీలక విషయాలను బయటపెట్టారు. తన అజెండా ఆస్తులు కాదని, ఒకవేళ ఆస్తులే కావాలనుకుంటే ఎప్పుడో కోర్టుకు వెళ్లేదానిని అని స్పష్టం చేశారు. జగనే వేరొకరి ఆస్తిని అనుభవిస్తున్నారని, తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ఆస్తుల పంపిణీపై తల్లి విజయమ్మ ఇచ్చిన వివరణపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను షర్మిల తీవ్రంగా ఖండించారు.
ఇవి కూడా చదవండి
విజయమ్మ విడుదల చేసిన లేఖ పక్కా నిజమని, అది వాస్తవం కాబట్టే జగన్ దానిపై నోరు మెదపడం లేదని ఆమె ఆరోపించారు. విజయమ్మపై ఒత్తిడి తెచ్చి సంతకం పెట్టించానని వైసీపీ నేతలు మొరుగుతున్నారు.. జగన్కు మాట్లాడే దమ్ము, ధైర్యం లేదా? అంటూ సవాల్ విసిరారు. వివేకా హత్య కేసులో న్యాయం జరగాలన్నదే తన పోరాటమని, కానీ వైసీపీ నేతలు కావాలనే ఆస్తుల అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మళ్లించాలని చూస్తున్నారని షర్మిల విమర్శించారు. ఏది ఎలా ఉన్నా తల్లి విజయమ్మ లేఖపై జగన్ మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.
ఇవి కూడా చదవండి








