ప్రవాస భారతీయులకు టీటీడీ శుభవార్త
ప్రవాస భారతీయులు (NRIs) సుపథం మార్గంలో శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రస్తుతం ఉన్న గడువు పరిమితిని తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) 30 రోజుల నుంచి 90 రోజులకు పెంచింది. ఇప్పటివరకు ప్రవాస భారతీయులు శ్రీవారిని దర్శించుకునేందుకు వారు స్వదేశానికి వచ్చిన 30 రోజుల్లో ఒరిజినల్ పాస్పోర్ట్ (Original passport,), ఒక సెట్ జిరాక్స్ కాపీ తీసుకుని సుపథం (Supatham) మార్గం వద్దకు చేరుకుంటే పాస్పోర్ట్ పరిశీలించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెన్ను జారీ చేస్తున్నారు. అయితే కొందరు ప్రవాస భారతీయులకు 30 రోజుల కాలపరిమితి ఇబ్బందికరంగా మారింది. దీనిపై గడువు పెంచాలని టీటీడీ (TTD) విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో స్పందించిన టీటీడీ 90 రోజులకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.








