మాటలు రావు.. కానీ ప్రేమను పలికిస్తున్నాడు!
అనీష్(Aneesh), అనస్వర రాజన్(Anaswara Rajan) జంటగా నటిస్తున్న సినిమా ఇట్లు అర్జున(ITlu Arjuna) ప్రమోషన్లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచగా, తాజాగా మేకర్స్ మూడో పాట ఎల్లో చున్నీ(yellow Chunni)ని రిలీజ్ చేశారు. తమన్(thaman) సంగీతం అందిస్తున్న ఈ సాంగ్ మెలోడీ ప్రియులతో పాటు యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. వినూత్న ప్రచార కార్యక్రమాలతో మొదటి నుంచీ సినిమాపై దృష్టిని ఆకర్షిస్తున్న మేకర్స్, ఈ సాంగ్ తో మరోసారి వార్తల్లో నిలిచింది.
ఈ సాంగ్ లో అనీష్, అనస్వర రాజన్ మధ్య కెమిస్ట్రీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. బాల్రూమ్ డ్యాన్స్‌లో ఇద్దరూ తమదైన శైలిలో అలరించారు. మాటలు రాని యువకుడి పాత్రలో అనీష్ ఎక్స్ప్రెషన్స్, కళ్లలో పలికించే ఎమోషన్స్ ఆకట్టుకుంటున్నాయి. తమన్ అందించిన ట్యూన్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ సాంగ్ కు స్పెషల్ మూడ్ ను తీసుకొచ్చాయి. శ్రీజో(Sri jo) సాహిత్యానికి విశాల్ మిశ్రా(Vishal Mishra) గాత్రం, మధ్యలో వచ్చే ఇంగ్లీష్ లిరిక్స్ మరింత అందాన్ని జోడించాయి.
ఇవి కూడా చదవండి
మాటలు రాని ఓ యువకుడు ప్రేమలో పడిన తర్వాత అతడి ప్రయాణం ఎలా సాగిందనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. మహేష్ ఉప్పాల(mahesh uppala) దర్శకత్వం వహిస్తుండగా, వెంకీ కుడుముల భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రేమ కోసం ఆ యువకుడు ఎంతవరకు వెళ్తాడనేది సినిమాలో కీలకంగా ఉండనుంది. ఇట్లు అర్జున సినిమా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.








