టీడీపీలో చేరిన మంగళగిరి వైసీపీ నేత జొన్నాదుల వరప్రసాదరావు(మణి)
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి లోకేష్
అమరావతి: మంగళగిరి పట్టణానికి చెందిన వైసీపీ నేత, మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జొన్నాదుల వరప్రసాదరావు(మణి) మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో వరప్రసాదరావుతో పాటు ఆయన సతీమణి కృష్ణవేణిలకు పసుపు కండువా కప్పి మంత్రి లోకేష్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జొన్నాదుల వరప్రసాదరావు మొదటి నుంచి చేనేత పరిశ్రమ ద్వారా అనేక మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పించారు. మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం గౌరవ సలహాదారుగా, మార్కండేయ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులుగా, మంగళగిరి చేనేత వృత్తి రక్షణ కమిటీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 2005వ సంవత్సరంలో నియమితులయ్యారు. 21 ఏళ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి వరప్రసాదరావు విశేషంగా కృషిచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్ పాల్గొన్నారు.








