గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన మమిత బైజు
మలయాళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మమిత బైజు(maitha baiju) ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ(prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై హనుమాన్(jai hanuman) సినిమాలో మమిత కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం మేకర్స్ ఆమెను సంప్రదించగా, ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఫైనల్ డిస్కషన్స్ జరుగుతున్నాయని టాక్. అయితే మేకర్స్ నుంచి ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో హీరోగా రిషబ్ శెట్టి(rishab shetty) నటిస్తుండగా, వామికా గబ్బి(wamiqa gabbi) మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. హంపిలో సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా ఆడియన్స్ ను టార్గెట్ గా చేసుకుంది.
ఇవి కూడా చదవండి
ప్రేమలు(premalu) సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మమిత, ప్రస్తుతం తమిళం, తెలుగు సినిమాల పైనా దృష్టి సారిస్తున్నారు. డ్యూడ్(Dude), జన నాయగన్(jana nayagan), విశ్వనాథ్ అండ్ సన్స్(viswanath and sons) వంటి సినిమాలతో ఇతర భాషల్లోనూ తన పరిధిని విస్తరిస్తున్నారు. జై హనుమాన్(jai hanuman) లో మమిత ఫిక్సైతే, టాలీవుడ్ లో ఆమె కెరీర్‌కు ఇది మరో కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.








