లైకాతో జేసన్ సంజయ్ మరో సినిమా.. కానీ ఈసారి
హీరో, పొలిటీషియన్ విజయ్(vijay) కొడుకు జేసన్ సంజయ్(jason sanjay) సినీ ప్రయాణంలో మరో కీలక అడుగు వేయనున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. ఇప్పటివరకు డైరెక్టర్ గా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న సంజయ్, త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్(lyca productions)తో ఆయన డిస్కషన్స్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
డైరెక్టర్ గా జేసన్ సంజయ్ తెరకెక్కించిన సిగ్మా(Sigma) సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనతో మరో ప్రాజెక్టును రూపొందించేందుకు లైకా సంస్థ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. జేసన్‌ను హీరోగా పరిచయం చేసే కథ కోసం పలువురు డైరెక్టర్ల నుంచి కథలను విన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ డైరెక్టర్ లింగుస్వామి(lingu swamy) కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
మరోవైపు, జేసన్‌కు మామయ్య వరుసయ్యే సంజీవ్(Sanjeev) దర్శకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, దర్శకుడి ఎంపికపై క్లారిటీ రావాల్సి ఉంది. విజయ్ వారసుడిగా జేసన్ ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని సంపాదించుకున్నారు. డైరెక్షన్ నుంచి యాక్టింగ్ వైపు సంజయ్ అడుగులు వేస్తాడా, లైకా ప్రొడక్షన్స్‌తో ఈ కాంబినేషన్ కార్యరూపం దాలుస్తుందా అన్నది అఫీషియల్ అనౌన్స్మెంట్ తర్వాతే తేలనుంది.








