సుదీర్ఘ ప్రస్థానం – సమర్ధ నాయకత్వం : మోదీ జీ, ప్రణామం – మాగులూరి భానుప్రకాష్ (USA)
నరేంద్ర దామోదరదాస్ మోడీ. ఒక సామాన్యుని – అసామాన్య జీవిత చరిత్ర. ఎన్నో సమస్యలు, అవరోధాలు, విమర్శలను తన అప్రతిహత విజయానికి మెట్లుగా మలచుకొని శిఖరాగ్రాన్నికెదిగిన అరుదైన రాజకీయయోధుడు. 25 ఏళ్ళ పాటు ప్రజామోదంతో, కోట్లాది మంది తలరాతను లిఖించే చట్ట, శాసన సభల ప్రాతినిధ్యం, నాయకత్వం ఆయన సొంతం. 78 ఏళ్ళ అఖండ స్వాతంత్య్ర భారతదేశాన్ని పరిపాలించిన ఎందరో అభ్యుదయ వాదులు, సంస్కర్తలు. చిన్న వయసులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో చేరి, సామాన్యునిగా జీవితం ఆరంభించి.. క్రమశిక్షణ, అంకితభావం పెట్టుబడిగా దశాబ్దాల పాటు ప్రజలతో మమేకమై, సంచలనాలకు కేంద్ర బిందువై.. 2001 నుండి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆపై ప్రజామోదంతో 2014 నుండి భారతదేశ ప్రధానిగా, దేశ దిశా, దశను మార్చిన ప్రధానిగా మోదీ ప్రజాశీస్సులతో.. ఆర్థిక విధానాలు, చట్ట నిర్ణయాలు మరియు జాతీయ సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
ఇవి కూడా చదవండి
సామాన్యునిగా మొదలై అసామాన్యునిగా, భారతదేశ ప్రధానిగా చరిత్రకెక్కిన మోదీ జీవితంలోని పలు ఘట్టాలు, నిర్ణయాలు, జీవన విధానం మనకు ఆదర్శం. ఒక్కవోని దీక్ష, నిరంతర శ్రమ, క్రమశిక్షణ తో పాటు తరాలు మారుతున్నా నూతన పాలన విధానాలను సమీక్షించుకుంటూ, పొరుగు దేశాలతో ద్వైపాక్షిక ఆర్థిక, రక్షణ సంబంధాలను పటిష్టం చేసుకుంటూ, ఒక సామాన్య వ్యక్తి జీవితంలో తపన, తప్పస్సుతో పోరాడితే ఆకాశమే హద్దు అని నిరూపించి కోట్లాది మందికి తన నిజ జీవిత ఘన విజయాలతో ఆదర్శంగా నిలిచిన , నాయకుడు, ప్రజా ప్రతినిధి నరేంద్ర మోదీ. ప్రవాస భారతీయులందరి తరపునా అభినందనలు, శుభాకాంక్షలు..








