వారణాసిలో రాజమౌళి మరో ప్రయోగం.. ప్రత్యేక భాషతో కొత్త ప్రపంచం!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) తన సినిమాల్లో కొత్తదనానికి పెద్దపీట వేస్తుంటారు. ఇప్పుడు మహేష్ బాబు(mahesh babu) హీరోగా తెరకెక్కుతున్న వారణాసి(Varanasi) సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ ప్రయోగానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా(priyanka chopra), పృథ్వీరాజ్ సుకుమారన్(Prithvi raj sukumaran) కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో కథ కోసం ప్రత్యేకంగా ఓ కల్పిత భాషను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఓ కాలప్రయాణ ఘట్టంలో ఈ భాష కీలకంగా మారనుందని, పురాతన గుహ గోడలపై కనిపించే రహస్య లిపిని అర్థం చేసుకోవడం కథలో ముఖ్యమైన మలుపుగా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది.
గతంలో బాహుబలి(baahubali) సినిమాతోనూ రాజమౌళి ఇలాంటి ప్రయోగం చేశారు. ఆ సినిమాలో కాలకేయుల కోసం రైటర్ మదన్ కార్కీ(madan karki) సహకారంతో కిలికి(kiliki) భాషను క్రియేట్ చేశారు. అయితే వారణాసి కోసం రూపొందిస్తున్న భాష కేవలం సంభాషణలకే పరిమితం కాకుండా, ప్రత్యేక లిపి, వ్యాకరణంతో కూడిన వ్యవస్థగా ఉండనుందనే డిస్కషన్ ఆసక్తిని పెంచుతోంది. దీనివల్ల సినిమాలోని మిస్టరీకి మరింత బలం చేకూరే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
ప్రపంచ సినీ చరిత్రలో లార్డ్ ఆఫ్ ది రింగ్స్(Lord of the rings), గేమ్ ఆఫ్ థ్రోన్స్(Game Of Thrones), డ్యూన్(Dune) వంటి సినిమాలు కల్పిత భాషలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు వారణాసి కూడా అదే తరహాలో తనకంటూ ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేస్తోంది. వివిధ కాలాలు, ప్రాంతాల నేపథ్యంలో సాగే ఈ భారీ సినిమా 2027 ఏప్రిల్ 7న థియేటర్లలోని రానుంది.








