అమరావతిలో చెస్ అకాడమీ.. కోనేరు హంపికి మంత్రి లోకేశ్ హామీ
మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేసిన ప్రఖ్యాత చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి
అమరావతి: ప్రఖ్యాత చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి, తండ్రి అశోక్ శుక్రవారం ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ఇటీవల జరిగిన చెస్ ఒలింపియాడ్-2026 మహిళల విభాగంలో భారత జట్టు కాంస్య పతకం, వ్యక్తిగత విభాగంలో కోనేరు హంపి బోర్డు-1లో కాంస్య పతకం కైవసం చేసుకోవడం పట్ల మంత్రి అభినందనలు తెలిపారు. అమరావతిలో చెస్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం తరపున మద్దతుగా నిలవాలని కోనేరు హంపి చేసిన విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి.. ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.








