రౌడీ హీరో ఈ సారైనా సక్సెస్ అందుకుంటాడా?
విజయ్ దేవరకొండ(vijay devarakonda) కెరీర్ ఆరంభంలోనే వచ్చిన సక్సెస్‌లు అతడిని టాలీవుడ్లో క్రేజీ హీరోగా నిలబెట్టాయి. పెళ్లిచూపులు(pelli choopulu), అర్జున్ రెడ్డి(Arjun Reddy), గీత గోవిందం(Geetha Govindam) సినిమాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో.. ట్యాక్సీవాలా(Taxiwala)తో మరో సక్సెస్‌ను అందుకున్నాడు. అయితే 2018 తర్వాత విజయ్‌కు ఆశించిన స్థాయిలో సక్సెస్‌లు దక్కలేదు. డియర్ కామ్రేడ్(Dear comrade), వరల్డ్ ఫేమస్ లవర్(World Famous lover), లైగర్(Liger), ఖుషి(kushi), ది ఫ్యామిలీ స్టార్(the family star), కింగ్డమ్(Kingdom) సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు అతడి ఆశలన్నీ రణబాలిపైనే ఉన్నాయి.
విజయ్ దేవరకొండ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో చిత్రబృందంలోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ సినిమాతో తన ఫ్లాపుల పరంపరకు తెరదించి, తిరిగి సక్సెస్ బాట పట్టవచ్చని విజయ్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సినిమాలోని కథ, తన క్యారెక్టర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయనే నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
ట్యాక్సీవాలా, శ్యామ్ సింగ రాయ్(Shaym Singaroy) సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సాంకృత్యన్(Rahul Sankrityan) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా(rashmika mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్, రష్మిక జోడీ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. వచ్చే వారం ఆడియన్స్ ముందుకు రానున్న రణబాలి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా విజయ్ కెరీర్‌కు మళ్లీ ఊపిరి పోస్తుందా అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.








