మంచి రిలీజ్ డేట్ ను పట్టేసిన అలియాస్ రుక్మిణి.. నితిన్ తో నాని సరికొత్త ప్రయత్నం
నేచురల్ స్టార్ నాని(nani) తన యునానిమస్ ప్రొడక్షన్స్ ద్వారా విభిన్నమైన కథలకు ప్రోత్సాహం అందిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. దీప్తి గంట(Deepti ganta) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ నుంచి వస్తున్న సినిమాలు కంటెంట్ పరంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. తాజాగా నితిన్(nithin) ప్రధాన పాత్రలో నటిస్తున్న అలియాస్ రుక్మిణి(Alias Rukmini) సినిమాను నాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మురళీకాంత్ దేవసోత్(muralikanth Devasoth) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 4న థియేటర్లలోకి రానుంది. రీసెంట్ గా రిలీజైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఈ సినిమాలో నితిన్, కృష్ణ అనే సాధారణ వ్యక్తిగా కనిపించనున్నారు. రైటర్ గా, ప్రేమించే భర్తగా ఆయన పాత్రను పరిచయం చేసిన తీరు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రోజువారీ జీవితానికి దగ్గరగా ఉండే మనుషులు, వారి ఎమోషన్స్, బాండింగ్స్ చుట్టూ కథ సాగనున్నట్లు గ్లింప్స్ సూచిస్తోంది. సాధారణ వ్యక్తి జీవితంలో దాగివున్న రహస్యాలు, ప్రేమ అతడి జీవితాన్ని ఎలా మార్చిందనే అంశాలు ఈ కథలో కీలకం కానున్నాయి. నితిన్ లుక్, క్యారెక్టర్ లోని సహజత్వం సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచే అవకాశముంది.
ప్రస్తుతం అలియాస్ రుక్మిణి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉండగా, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. విజయ్ బుల్గానిన్(Vijay bulganin) మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాపై రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తో అంచనాలు మరింత పెరిగాయి. నాని నిర్మాణ భాగస్వామ్యంతో వస్తున్న ఈ ఎమోషనల్ స్టోరీ ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.








