రిజర్వేషన్లు ఇవ్వొద్దదని సుప్రీంకోర్టు చెప్పలేదు : మంత్రి పార్థసారథి
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని మంత్రి పార్థసారథి (Parthasarathi) తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పై సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు నేపథ్యంలో పార్థసారధి మీడియాతో మాట్లాడారు. చట్టపరంగా ఇబ్బందులు ఎదురైనా టీడీపీ పరంగా బీసీలకు సముచిత రాజకీయ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల ((BC reservations)) విషయంలో న్యాయపరంగా ముందుకెళ్లాలని సుప్రీంకోర్టు చెప్పింది. రిజర్వేషన్లు ఇవ్వొద్దని చెప్పలేదు. స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోతాయి. బీసీ గణనను త్వరగా పూర్తిచేసి ఆమోదించి రిజర్వేషన్లు కల్పిస్తాం. ప్రజాస్వామ్యంపై నమ్మం లేని పార్టీ వైసీపీ. ఆ పార్టీ ఎమ్మెల్యేలు గత రెండున్నరేళ్లలో అసెంబ్లీ (Assembly) కి వచ్చి ప్రజాసమస్యలపై మాట్లాడలేదు. ఎన్నికలపైనా ఆ పార్టీకి గౌరవం లేదు అని విమర్శించారు.








