వైసీపీకి ఎదురుదెబ్బ … స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్
వైసీపీకి సుప్రీంకోర్టు (Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో స్థానిక ఎన్నికల నిర్వహణకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సర్ ప్రక్రియ పూర్తయిన తరువాతే స్థానిక ఎన్నికలు జరపాలంటూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఆ పార్టీ లేవనెత్తిన ఏ విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. హైకోర్టు ఇచ్చిన సమయం ప్రకారం ఆరు వారాల్లోపు నోటిఫికేషన్‌కు సిద్దమని రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. నోటిఫికేషన్ (Notification) విడుదలయ్యేలోపు సర్ పూర్తయితే ఆ జాబితా తీసుకోవాలని, లేకపోతే పాత జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏపీ హైకోర్టు ( AP High Court) ఇచ్చిన తీర్పును సీజేఐ సూర్యకాంత్ (CJI Surya Kant) నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. ఎన్నికలకు ఆటంకం కలిగించడమంటే ప్రజా ప్రయోజనాలను అడ్డుకోవడమేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది.








