శాంతి చర్చల దిశగా మళ్లీ అడుగులు..! ఇరాన్ కు అమెరికా ప్రత్యామ్నాయ ప్రతిపాదన..!
పశ్చిమాసియా యుద్ధం సరిహద్దులు దాటుతోంది. ఓవైపు అమెరికా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంటే.. ప్రతిగా టెహ్రాన్ గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తోంది.అంతే కాదు.. ఏకంగా మాండెబ్ జలసంధిని గుప్పిట పట్టేదిశగా అడుగులేస్తున్నారు హుతీలు. ఇలాంటి తరుణంలో శాంతిచర్చల కోసం అమెరికాకు ఇరాన్ ప్రతిపాదన పంపగా .. దాన్ని ట్రంప్ తిరస్కరించారు. అయితే దానికి ప్రత్యామ్నాయంగా మరో ప్రతిపాదన అమెరికా నుంచి వచ్చిందంటోంది ఇరాన్.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి (Abbas Araghchi) కీలక విషయాలు వెల్లడించారు. తాము చేసిన ప్రతిపాదనను (Irans peace plan) మొదట తిరస్కరించిన అమెరికా.. మళ్లీ తమకు ప్రత్యామ్నాయ ప్రతిపాదన పంపిందని పేర్కొన్నారు. ప్రస్తుతం దానిపై ఇరుదేశాల బృందాల మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. త్వరలో అధికారికంగా సమాధానం ఇస్తామన్నారు. చర్చలను కాదని.. తమకు వ్యతిరేకంగా ఏదైనా సైనిక చర్య చేపడితే దీటుగా బదులిస్తామని అగ్రరాజ్యాన్ని హెచ్చరించారు. యుద్ధాన్ని విరమించేందుకు తాము ఎల్లప్పుడూ దౌత్య చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఇవి కూడా చదవండి
నవంబరులో అగ్రరాజ్యంలో మధ్యంతర ఎన్నికలు (Midterm Polls) జరగనున్నాయి. నవంబర్ 3కు ముందు (ఎన్నికలకు ముందు) ఇరాన్‌పై దాడులకు తాను ఆదేశించబోనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) తెలిపారు. టెహ్రాన్‌తో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని.. త్వరలో యుద్ధం ముగుస్తుందని తాను విశ్వాసంతో ఉన్నానని తెలిపారు. మరోవైపు అగ్రరాజ్యానికి చెందిన విమాన వాహక నౌకలు పశ్చిమాసియా వైపు కదులుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇవి అక్టోబర్ చివరి నాటికి పశ్చిమాసియా తీరాలకు చేరుకుంటాయని అంచనా.








