ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్
స్థానిక ఎన్నికల్లో బీసీ (BC)లకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు (High Court) ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. 34 శాతం కోటాతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటుతున్నాయంటూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు ఇటీవల కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు జస్టిస్ దీపాంకర్ దత్తా (Justice Dipankar Datta) ధర్మాసనం నిరాకరించింది. డెడికేటెడ్ కమిషన్ నివేదికను అమలు చేస్తున్నట్లు ఎక్కడుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.








