సుప్రీంకోర్టు జడ్జిటెంట్ తర్వాతే ఏపీలో ఎన్నికలు : పునేఠా
ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠా (Anil Chandra Punetha) స్పష్టం చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, జిల్లా అధికారులు, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ (Video conference) నిర్వహించారు. స్థానిక ఎన్నికల ఏర్పాట్లపైనే ప్రధానంగా చర్చించినట్టు పునేఠా తెలిపారు. రెండు నెలులుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికలకు అధికారులందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సుప్రీంకోర్టు (Supreme Court) జడ్జిమెంట్ తర్వాత ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బ్యాలెట్ పేపర్ (Ballot paper) విధానంలోనే ఎన్నికలు జరుగుతాయన్ని, 5 ఫిబ్రవరి 2026 వరకు ఉన్న ఫోటో ఓటర్ల జాబితానే అనుసరిస్తామని తేల్చి చెప్పారు.








