కక్కలేక, మింగలేక… కోరి తెచ్చుకున్న యుద్ధంతో అమెరికాకు ఊహించని నష్టం
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికా భారీగా నష్టపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ యుద్ధం కారణంగా అమెరికాకు సుమారు 3.3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.31 వేల కోట్లు) మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి అమెరికా సైనిక దళం ఏకంగా 81 సైనిక విమానాలు, డ్రోన్లు , హెలికాప్టర్లను కోల్పోయింది లేదా దెబ్బతిన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వీటిలో అత్యంత అధునాతనమైన F-35A లైట్నింగ్ II స్టెల్త్ ఫైటర్, 12 F-15E స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ల వంటి శక్తివంతమైన యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. జోర్డాన్‌లోని మువఫ్ఫాక్ సాల్టి ఎయిర్ బేస్‌పై ఇరాన్ జరిపిన వైమానిక దాడుల్లో ఎనిమిది F-15E జెట్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే వాటికి మరమ్మతులు నిర్వహించి తిరిగి సేవలోకి తీసుకువచ్చినట్లు అమెరికా సైనిక వర్గాలు వెల్లడించాయి.
ఇక ఒక్కొక్కటి 30 నుండి 50 మిలియన్ డాలర్ల విలువ చేసే 45 MQ-9 రీపర్ డ్రోన్లు కూడా ఈ దాడిలో ధ్వంసమయ్యాయి. నిఘా , క్షిపణి దాడులకు అత్యంత కీలకమైన ఈ డ్రోన్లు దెబ్బతినడంతో అమెరికా డ్రోన్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. తన వద్ద ఉన్న అత్యంత ఆధునిక ఐదో తరానికి చెందిన F-35A విమానంతో పాటు E-3 సెంటినల్ నిఘా విమానాలను కూడా ఇరాన్‌పై దాడుల్లో అమెరికా కోల్పోయింది. అయితే ఈ మొత్తం నష్టానికి సంబంధించిన కచ్చితమైన గణాంకాలను అమెరికా అధికారికంగా వెల్లడించలేదు. మరోవైపు సోచి తీరంలో సముద్రం మండుతున్నట్లుగా ట్యాంకర్‌పై జరిగిన దాడితో చమురు ఒలికిన ఘటన కూడా కలకలం రేపింది. మొత్తానికి ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని కోరి తెచ్చుకుని, కక్కలేక, మింగలేక అమెరికా సతమతమవుతోందనేది సుస్పష్టం.
అమెరికా కోల్పోయిన కీలక ఫైటర్ జెట్లు, విమానాల జాబితా:
ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు – 12
ఎఫ్-35ఏ లైట్నింగ్ II స్టెల్త్ యుద్ధ విమానం – 1
ఏ-10 వార్థాగ్ దాడి విమానాలు – 2
కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ గగనతల ఇంధన సరఫరా విమానాలు – 7
ఈ-3 సెంట్రీ గూఢచార విమానం – 1
ఎంసీ-130జే కమాండో II ప్రత్యేక కార్యకలాపాల విమానాలు – 2
హెచ్‌హెచ్-60డబ్ల్యూ జాలీ గ్రీన్ II యుద్ధ శోధన-రక్షణ హెలికాప్టర్ – 1
ఎంక్యూ-4సీ ట్రైటాన్ అధిక ఎత్తులో ఎక్కువసేపు ఎగిరే డ్రోన్ – 1
ఎంక్యూ-1 బహుళ ప్రయోజన డ్రోన్లు – 3
ఏహెచ్-64 అపాచీ దాడి హెలికాప్టర్ – 1
ఏహెచ్-6 లిటిల్ బర్డ్ తేలికపాటి దాడి హెలికాప్టర్లు – 4
ఎంహెచ్-60 సీ హాక్ సముద్ర హెలికాప్టర్ – 1
ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు – 45








