మంత్రి లోకేష్ ను కలిసిన యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారిక
ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ సాధించడం పట్ల మంత్రి అభినందన
అమరావతి: రాష్ట్రానికి చెందిన యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారిక కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఫిడే ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను దక్కించుకున్న నిహారికను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఉమెన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా నిహారిక వివరించారు. ఇందుకు ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.








