నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
వికసిత్ భారత్‌తో పాటు స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను తన ప్రసంగంలో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
ప్రధానమంత్రిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి సమావేశంలో ముందుగా అభినందనలు తెలిపిన సీఎం
సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…
• పాలసీ పెరాలసిస్ నుంచి గత దశాబ్ద కాలంగా భారత్ పాలసీ గ్రోత్ వైపుగా అడుగులు వేసింది.
• మోదీ హయాంలో డిజిటల్ ఇండియా, జన్ ధన్, ఆధార్, యూపీఐ, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు వచ్చాయి.
• సరళీకరణ, పాలనా సంస్కరణలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లు భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి.
• భౌగోళిక రాజకీయ అనిశ్చితి పరిస్థితులు ఉన్నా భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరించింది.
• ప్రధాని మోదీ రూపకల్పన చేసిన వికసిత్ భారత్ 2047కు ఏపీ కూడా స్వర్ణాంధ్ర విజన్‌ను అనుసంధానం చేశాం.
• అభివృద్ధికి మానవ వనరులే పునాదిగా స్వర్ణాంధ్ర @2047 విజన్ రూపకల్పన జరిగింది.
• పేదరిక నిర్మూలన, నైపుణ్యం, ఉపాధి, నీటి- ఇంధన భద్రత, అగ్రి-టెక్, గ్లోబల్ లాజిస్టిక్స్, డీప్-టెక్ లాంటి 10 సూత్రాలను భాగం చేశాం
• ఈ లక్ష్యాలను చేరుకునేందుకు సాంకేతికత, పారదర్శక డేటా డ్రివెన్ పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశాం
• ఆర్టీజీఎస్ ద్వారా కీ పెర్ఫార్మెన్సు ఇండికేటర్లను పర్యవేక్షిస్తున్నాం
• వాతావరణం, పంటల స్థితిగతులు, భూగర్భ జలాల వంటి 41 రకాల సమాచారాన్ని రియల్ టైమ్ లో విశ్లేషించి ప్రజలకు సమాచారం ఇస్తున్నాం
• మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్ ద్వారా ప్రభుత్వ సేవల్ని పారదర్శకంగా ప్రజల ఇంటివద్దనే అందిస్తున్నాం
• స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో గడచిన 2 ఏళ్లలో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం
• పెట్టుబడుల్ని ఆకర్షించటంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని అదే సమయంలో అస్థిరమైన విధానాలు మేలు చేయవు.
• అత్యుత్తమ స్థాయి మౌలిక సదుపాయాలు, వేగంగా అనుమతుల జారీ లాంటి స్థిరమైన వాతావరణం కల్పనపై దృష్టి పెట్టాలి
• గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, కుళాయి నీరు, వంటగ్యాస్, విద్యుత్, డిజిటల్ కనెక్టివిటీ, డీబీటీ లాంటి ప్రజలకు అందించాలన్నదే తమ లక్ష్యం
• పీ4 లాంటి కార్యక్రమం ద్వారా సమాజంలో ఆర్ధిక అసమానతలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం
• ప్రజల వైద్యారోగ్య పరిరక్షణకు సంజీవని అనే వినూత్న కార్యక్రమం ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తున్నాం
• ఆయుష్మాన్ భారత్‌తో అనుసంధానించటం ద్వారా ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య రక్షణ అందించటమే లక్ష్యం
• యోగా, మెడిటేషన్ లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మానవ వనరుల అభివృద్ధిపై దృష్టిపెట్టాం
• విద్యారంగంలో ప్రాథమిక అభ్యాసం నుంచి ఉన్నత విద్య వరకూ సమూల సంస్కరణలు చేపట్టాం
• గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంతో పాటు ఏఐ ఆధారిత అడాప్టివ్ లెర్నింగ్ వ్యవస్థలతో ఫలితాలను మెరుగు పరుస్తున్నాం.
• వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ మోడల్ విద్యార్ధులు చదువుకుంటూనే నైపుణ్యాలు పొందుతున్నారు.
• నైపుణ్యం వెబ్ పోర్టల్, పీఎం సేతు ద్వారా ఏఐ, క్వాంటం టెక్నాలజీస్ లాంటి రంగాల్లో యువతను సిద్ధం చేస్తున్నాం
• రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5 కంటే తక్కువకు పడిపోవడం వల్ల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది
• భవిష్యత్తులో ఆర్ధిక, మానవ వనరుల కొరత ఏర్పడకుండా ఏపీలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ రూపొందిస్తున్నాం. దీనిపై జాతీయ స్థాయిలో కార్యాచరణ అవసరం
• వికసిత్ భారత్ 2047 రూపకల్పనలో కేంద్ర రాష్ట్రాల మధ్య నిరంతర భాగస్వామ్యం అవసరం
• ఈ లక్ష్య సాధనకు నీతి ఆయోగ్ తో కలిసి పనిచేసేందుకు ఏపీ సిద్ధంగా ఉంటుంది








