దేశాభివృద్ధి కోసం నిరంతరం తపించే వ్యక్తి మోదీ : చంద్రబాబు
దేశాభివృద్ధి కోసం నిరంతరం తపించే వ్యక్తి ప్రధాని మోదీ (Modi) అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీయే (NDA) భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచదేశాల్లో భారత్ (India) గౌరవాన్ని మోదీ పెంచారని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధికి కూడా కేంద్ర పూర్తిగా మద్దతిస్తోందన్నారు. ఎన్డీయే ఏర్పడింది ఎన్నికల కోసం కాదు, దేశం కోసం, అధికారం కోసం కాదు, జాతీయ ప్రయోజనాల కోసం. రాష్ట్రాల్లో ఎన్డీయే సాధిస్తున్న వరుస విజయాలే మా పనితీరుకు సాక్ష్యం. బిహార్, అస్సాం, పుదుచ్చేరిలో ప్రజలకు మళ్లీ మాకు పట్టం కట్టారు. ఆయా రాష్ట్రాల్లో ఈ విజయాలు, సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు. బెంగాల్ మళ్లీ దేశానికి మార్గదర్శకంగా నిలిచే రోజు దగ్గరల్లోనే ఉంది. ప్రాచీన జ్ఞానం, డిజిటల్ పాలన, ఆవిష్కరణలే భారత్కు అతిపెద్ద బలం. అడ్డంకులు తొలగించి, స్పష్టమైన విధానాలతో దేశాన్ని మోదీ ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి భారతీయుడి మనోభావాలు అర్థం చేసుకున్న నాయకుడు మోదీ అని అన్నారు.








